Navaratri Aarti song Lyrics in Telugu

Navaratri 2021
Navaratri Aarti song Lyrics in Telugu

1.అంబ వాణి నన్ను ఆదరించవే..  పాట లిరిక్స్ తెలుగులో

అంబ వాణి నన్ను ఆదరించవే..

శంబరారి వైరి సాహోదరి
కంబుగళేశ్రిత కమలేశ్వరి

పరదేవి నిన్ను భజియించే
నిజ భక్తులను బ్రోచే పంకజాక్షివే
వర వీణా పాణి వాగ్విలాసిని
హరికేశపుర అలంకార వాణీ

2.హారతి మీరేల ఇవ్వరే, మహాలక్ష్మి పాట లిరిక్స్ తెలుగులో

హారతి మీరేల ఇవ్వరే, మహాలక్ష్మి దేవికి హారతీ మరేల ఇవ్వరే –2-
హారతీ మీరేల ఇవ్వరే సారసాక్షికి
లలిత దేవికి లీలతో వెలుగొందు తల్లికి పాలిత పద్మజకిపుడు — హారతీ ..

పాదములకు పూజ చేయరే పద్మాక్షికిపుడు పారిజాతపుహారమీడరే-2
ఆణిముత్యపు హారములు బంగారు గజ్జెల రవ్వలపాపడ అరయ చందన బొట్టు నుదుటన అమర మోమలరేడు జననికి — హారతి —

ఇంతపరాకేలననారే ఇందిరా రమణికి పంతమేల మానుమనారే 2
పద్మవాసిని పరంజ్యోతికి పద్మిని మా మనోహరిణిని
పద్మనాభుని రాణికిపుడు పద్మజాక్షికి పద్మకిపుడు — హారతి –

లక్షముగాను జ్యోతి కూర్చారే మాదేవితోనిక అక్షయంబుల నోసగమనరే

ఈప్పితంబుల నొసగు మాతకు అమరవంధ్యకు ఆదిదేవికి

కేరిన సంపదలిచ్చే దేవికి రక్షిత మంతెన్న నిలయకు. – హారతి —

3.మంగళం వరలక్ష్మి పాట లిరిక్స్ తెలుగులో 

మంగళం వరలక్ష్మి మంగళం మంగళం విజయలక్ష్మి మంగళం ||2||
మంగళం విశ్వజననీ మంగళం మంగళం లక్ష్మీదేవి మంగళం ||2|| మంగళం||

ఆదిమూలకారిణి అమృత కలశధారిణి ||2|| అమృత కలశధారిణి – ఆనందరూపిణి ||2|| మంగళం||

శంఖు చక్ర రాజతే చరణభరణశోభితే ||2||

చరణభరణశోభితే శాంతి సుఖలాలితే ||2||మంగళం||

ఆదిమధ్య విరహితే అమృత కలశధారితే ||2|| అమృత కలశ ధారితే.. ఆనందపూరితే ||2||
మంగళం ||

ఫాలతిలక శోభితే – పద్మకర విరాజితే ||2||

పాలితే ఫలప్రదే- పద్మసంభవనప్రీతే ||2|| మంగళం ||

4.దేవికిదే పూజ పాదపూజ పాట లిరిక్స్ తెలుగులో 

దేవికిదే పూజ పాదపూజ

మంచి మనసుతో చేసే మల్లెల పూజ ॥2||

కలకాలం దేవికి కనకాంబర మాల

చేయి వదలరాదని చేమంతుల మాల ॥2॥
మోహ క్షయ కారిణికి మొగలి పూల మాల ||2||

దయతలచే తల్లికి దవనపూ మాల ॥ దేవి ||

గుండెలోన దేవికి గులాబీ మాల

సర్వాంతర్యామికి సంపెంగల మాల ॥2॥
మమతల మా తల్లికి మాలతీ మాల ॥2॥
ప్రేమైక మూర్తికి – పొన్న పూల మాల ॥ దేవి ॥

నాద స్వరూపిణకి నాగమల్లి మాల

మందస్మిత వదనకు మందార మాల ॥2॥
తీయని పలుకుల తల్లికి తులసీదళ మాల ॥2॥

భక్త కల్పవల్లికి బంతి పూలమాల ॥ దేవి ॥

చల్లని చూపుల తల్లికి చంపక పూమాల

కరుణాల వాలకు కమలాల మాల ॥ 2 ॥
కలిదోష హారిణికి కలువ పూల మాల ॥2॥
సుగుణాల రాశికి సన్నజాజి మాల ॥ దేవి ॥

5.అమ్మా అమ్మా వినరండీ పాట లిరిక్స్ తెలుగులో

అమ్మా అమ్మా వినరండీ
పచ్చల మండప మదిగోలే
వాసవి వచ్చి కూర్చుంది….
భక్తుల కోర్కెలు తీర్చుటకై….. ||2||

ముద్దు మోమున, ముసి ముసి నగవులు ముక్కమల వాసినీ ఈ తల్లీ
ముచ్చట తీరగ చూడడీ…..
ముతైదువులకు మంగళమే ॥ అమ్మా॥

చంద్రవదనపు చారు – బోణీ,
వినాయకునితో – వచ్చింది,
అర్ఘ్యం పాద్యం, అభిషేకం
అమ్మవారికి చేయండి ॥ అమ్మా॥

నైవేద్యంబూ, తాంబూలంబూ,
వరుసగ – తల్లికి యివ్వండీ,
నీరాంజనమడి తల్లికి యిపుడూ.
సంతోషింపగ చేయండి ॥ అమ్మా॥

దీవెనలియగ వచ్చింది
దీర్ఘాయుష్యు పలికింది
అడిగిందల్లా యిస్తుంది.
భక్తుల చల్లగ చూస్తుంది.. ॥ అమ్మా॥

6.కనకదుర్గమ్మ కైలాసరాణీ  పాట లిరిక్స్ తెలుగులో

కనకదుర్గమ్మ కైలాసరాణీ
కాపాడవమ్మా భవానీ ॥2॥

జగదేకమాతా జయమీయవమ్మా ॥2॥
పసివారమమ్మా పాలించవమ్మా ॥ కనక ॥

నీలాలకురులు మొఖమెల్ల కళలు ॥2 ||
నెలవంక శిగలో దాచేవుతల్లీ ॥ కనక॥

మణిమకుటధారీ మలయా విహారీ ||2||

మహారాజ పుత్రీ శ్రీ మంగళగౌరీ ॥కనక |

కృష్ణా తీరాన బెజవాడలోన ||2||
విచిత్రముగ చూపేవు నీ లీలలమ్మా కరుణించ ॥కనక |

Leave a Comment

close