అల్లిపూల వెన్నెల Song Lyrics in Telugu-AR Rahman Bathukamma song

Song:Allipoola Vennela

Singer:Rakshita Suresh, Haripriya, Deepthi Suresh, Aparna Harikumar, Padmaja

Lyrics:Mittapalli Surender

పాట-అల్లిపూల వెన్నెల

పాడినవారు-రక్షిత సురేష్, హరిప్రియ, దీప్తి సురేష్, అపర్ణ హరికుమార్, పద్మజ

వ్రాసినవారు- మిట్టపల్లి సురేందర్

Telangana Jagruthi Bathukamma Song Allipoola Vennela lyrics in Telugu-AR Rahman

అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా
పూలకింద్ర ధనస్సులు నేలమీద నిలవగా
కొమ్మలన్ని అమ్మని వేల పూలు విరియగా
పుట్టమన్ను మట్టిలో… మట్టి గౌరి పుట్టగా
అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా
తరలివచ్చే తంగెడు… తనకు పట్టు చీరగా
రవికెలోన తామర… పువ్వులన్ని మారగా
తనువుకేమో గుమ్మడి… బంధమయ్యి నిలువునా
పొద్దుపొడుపు దిద్ది నీ నుదుటి మీద కుంకుమ
ఊలితల్లి గొంతులో కోయిలమ్మ కూయగా
తెలంగాణ కొచ్చెనే బతుకమ్మ పండుగా

ఆ ఆ ఆఆ ఆఆ… అహా అహా ఆఆ ఆ
అహా అహా ఆఆ ఆ
కమ్మగుండె గూటికి… ఆడపడచు ఆటకి
గునుగు పూల తోటకి ఏనుగు మీద తేగకి
ఏరువాక ఎదలకి… ఏటిలోని అలలకి
కట్ల పూల కళ్ళకి… కానుకయ్యి పల్లకి
తరలి తరలి వచ్చెనే బతుకమ్మ
వరదలపై తరలిపోవు తన జన్మ
ఆఆ ఆఆ, మెట్టినింటి పిలుపుతో
వెళ్లిపోయే చెల్లెలా
జ్ఞాపకాల బరువులో చెమ్మగిల్లె తల్లిలా
ఆడబిడ్డ చెయ్యిని… తల్లి తల్లి గడపని
దాటిపోయే నీటిలో ఒదిగిపోయె వేళలో
సాగనంపి చెల్లెలు… చెరువు కొమ్మ చివరలో
మరల మరలి రమ్మని బతుకమ్మని వీడగా
అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా
పూలకింద్ర ధనస్సులే నేలమీద నిలవగా
కొమ్మలన్ని అమ్మని వేల పూలు విరియగా
పుట్టమన్ను మట్టిలో… మట్టి గౌరి పుట్టగా
సై సై హయ్ హయ్
సై సై హయ్ హయ్
సై సై హయ్ హయ్
ఆ ఆ ఆఆ

AR Rahman Bathukamma Song Lyrics in Telugu

Leave a Comment

close