Chilaka సాంగ్ లిరిక్స్ తెలుగులో-Deepthi Sunaina

Song:Chilaka

Singer:vijai bulganin & lakshmi meghana

Lyrics:Suresh banisetti

Chilaka Song Lyrics in Telugu-Deepthi Sunaina

కన్నీటి సంద్రంలో న కంటిపాప జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటె ఏ ఏ..
ఏ ఏవెవరి నిన్నటి కలలు లేవు లేవులే..ఏ..

నా చిన్ని గుండెల్లోనా ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే
ఏంటి ఏంటి ఇది ఇంతటి బరువు మోయలేను లే..ఏ..

వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా
సుడిగాలి వేగంతో నీ వైపే వస్తున్నా
ఏ దారి మూస్తున్నా ఏ దాడి చేస్తున్నా
ప్రాణాలే తీస్తున్నా నిన్ను ఒదులుకోను

చిలకా ఓ రామ చిలకా చెరిగేది కాదే యెదపై నీ ముద్దు మరక
చిలకా ఓ రామ చిలకా ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునక

నా ఆశలకి ఆయువిమ్మని నా ఊహలకి ఊపిరిమ్మని
నా చీకటికి వెలుగు ఇమ్మని ఎవరినడగడం
నీ కంటపడె వీలు లేదని నీ వెంట వచ్చే దారి లేదని
నా జీవితమె జారుతూందని ఎలా తెలుపడం

ఒక్క పూట ఉండలేక పోయా నువ్వు లేక
వందేళ్ళెట్టా గడపాలిక
కన్న కలలే కట్టు కథ లాగా మార్చినాది
కలానికే దయ లేదు గా

చిలకా ఓ రామ చిలకా చెరిగేది కాదే యెదపై నీ ముద్దు మరక
చిలకా ఓ రామ చిలకా ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునక

ఆ వెన్నెలనే అడిగి చూసా ఈ వేకువని అడిగి చూసా
నీ జాడనే చూసి చెబుతాయేమో అనీ..
ఈ గాలితో కబురు పంపా మేఘాలతో కబురు పంపా
నా వేదనే నీకు వివరించాలి అనీ..

ఈ కలం పైన కత్తి దూయ్యలనుంది నిన్ను ఇంకా దాచిపెటట్టినందుకు
నా దేహం పైన మట్టి పోయాలనుంది నాకు నీతో రాసి పెట్టనందుకూ…

చిలకా ఓ రామ చిలకా ఆ..
ఓ ఓ రామ చిలుకా ఆ ..

కన్నీటి సంద్రంలో న కంటిపాప జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటె ఏ ఏ..
ఏ ఏవెవరి నిన్నటి కలలు లేవు లేవులే..ఏ..

నా చిన్ని గుండెల్లోనా ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే
ఏంటి ఏంటి ఇది ఇంతటి బరువు మోయలేను లే..ఏ..

చిలకా ఓ రామ చిలకా ఆ..నా మనసే నీకు ఎపుడో ఇచ్చాను కనుకా
చిలకా ఓ రామ చిలకా జత రావొద్దంటే అలుపే ఒంటరి నడక

Deepthi Sunaina Chilaka Song Lyrics in Telugu

Leave a Comment

close