Yevarive Prema Hrudayama పాట లిరిక్స్ తెలుగులో-IPL (It’s Pure Love)

Song:Yevarive Prema Hrudayama

Movie:IPL (It’s Pure Love)

Singer:Sunitha,Sid Sriram

Lyrics:Vengi

పాట-ఎవరివే ప్రేమ హృదయమా

పాడినవారు-సునీత, సిద్ శ్రీరామ్

వ్రాసినవారు-వెంగి

సినిమా- IPL (It’s Pure Love)

Yevarive Prema Hrudayama Song Lyrics in Telugu-IPL (It’s Pure Love) movie

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

వానలా కురిసె పరువమే
పువ్వులా విరిసే విరహమే
గాలికే తడిసె అధరమే
చిలిపి యాతనకే

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

వెర్రి మనసే వేగిపోయే
కుర్ర వయసుని ఆపకే
ఎర్రబొట్టే కరిగిపోయే
గుర్రు కన్నుల చూపుకి

నీ కంటిచూపే చాలు… తూరుపెందుకే
నా ఇంటి ఆకాశాన తారకెందుకే
నువ్వుంటే చాలు నాతో… అడుగు ముందుకే
నీవేడి కౌగిళ్ళుంటే… వేడుకెందుకే

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

ఆనందాల పూలు పూసే
అందమైన శ్వాసకే
సాయంత్రాలే పాలుపోసే
గుండెలోంచి చూడకే

ఏమిచ్చి తీర్చెయ్యాలి… తీపి నీ ఋణం
చేతుల్లో విరిసింది… కలికి పూవనం
ప్రేమించి పెళ్ళాడగా… మనదే ఈ శకం
నీలోనే నేనై ఉంటే… చాలదా సుఖం

ఎవరివే ప్రేమ హృదయమా
పెదవులే పాడె సరిగమ
ఎదని తాకేటి ప్రణయమా
కనుల కదలికలు తెలుపుమా

వానలా కురిసె పరువమే
పువ్వులా విరిసే విరహమే
గాలికే తడిసె అధరమే
చిలిపి యాతనకే

Yevarive Prema Hrudayama Song Lyrics in Telugu

Leave a Comment

close