Yelelo Yelelo పాట లిరిక్స్ తెలుగులో- Shaakuntalam

Song:Yelelo Yelelo

Movie:Shaakuntalam

Singer:Anurag Kulkarnii

Lyrics:Chaitanya Prasad

పాట-ఏలేలో ఏలేలో

పాడినవారు-అనురాగ్ కులకర్ణి

వ్రాసినవారు-చైతన్య ప్రసాద్

సినిమా-శాకుంతలం

Yelelo Yelelo Song Lyrics in Telugu-Shaakuntalam movie

ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఏటిలోనా సాగే నావా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దూరాలేవో చేరే తోవా
సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
ఓ… ఓ… ఓ…
సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
సారె పట్టుకొచ్చిందే సందమామ
చెలి కానీ గూడె సెరగా
అమ్మే తాను అయ్యే వేళా
అందాలే సిందే బాలా
తన మారాజైనోడే పూజే సేసేడో
ముని గారలమ్మ సెయ్యే పట్టేడా
తన పానాలన్నీ తానే అయ్యేడా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఒరా కంటా సూసినావా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దొరా సిగ్గై నవ్వినావా

రాజే తానై రాజ్యాలేలేటోడు
నిను సుడంగానె బంటై ఉంటాడు ఓ..
రాణిలాగా నిన్నే సుసేటోడు
నువ్వు సెరంగానే దాసుడవుతాడు
మేళలెన్నో తెచ్చి తాను దరువె వేసి
మెనాలెన్నో తెచ్చి
నిన్ను అతనే మోసి
పూలే జల్లి దేవరల్లే ఊరేగిత్తాడే
ఇలలోనే ఉన్న మేనకా నువ్వమ్మ
ఎనలేని గొప్ప కనుక నువ్వమ్మ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
సంతోషంగా సాగే నావ
ఊయలయి జంపాలై ఊగే నావ
ఊహల్లోన తేలినావా

తుపానైనా గీపనైనా రానీ
రగిలేటి ఆశ దీపనార్పేనా హో
కొంపలైనా శాపాలైన రానీ
ఎదురీదే యేటి కెరటాన్నాపేనా హో
ఏదేమైనా గాని ఎద నది ఆగేనా
మానేయన్న గాని మానసనగారేనా
ఏరే ఇంకి నీరే బొంకి
దారే దిబ్బైనా దరి సెరలమ్మ
సాగే నావమ్మ
ప్రతి రోజు కొత్త కాన్పె సూడమ్మా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
తీరాలెన్నో దాటే నావా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
సొంత గూడె సెరినావా

Yelelo Yelelo Song Lyrics in Telugu

Leave a Comment

close