Movie:18 Pages
Singer:Sid Sriram
Lyrics:Shree Mani
పాడినవారు-సిద్ శ్రీరామ్
వ్రాసినవారు-శ్రీమణి
సినిమా-18 Pages
Yedurangula Vaana Song Lyrics in Telugu-18 Pages Movie
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ
ఏడు రంగుల వాన
రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే
అక్షరాల నువ్వే
ఇన్నినాళ్ళుగ ఉన్నా
ఇప్పుడే పుడుతున్నా
కారణం ఎవరంటే
ఖచ్చితంగా నువ్వే
మబ్బునీ మెరుపునీ కలిపినా వానల్లే
పెదవికీ నవ్వుకీ పరిచయం నీ వల్లే
చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం
మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం
వినవే నందిని ఆనందిని
నువ్వే అరవిందమై నన్నే చేరినావే
నా వందనం నీకే
వినవే నందిని ఆనందిని
నువ్వే ఆనందమై నన్నే తాకినావే
నా వందనం నీకే
ఏడు రంగుల వాన
రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే
అక్షరాల నువ్వే
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ
నీకంటు భాషొకటుంది అవునా
పలికించగలవుగా రాళ్ళనైనా
కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే
కొత్త గొంతే టెన్ టు ఫైవ్ వచ్చెనంటూ
పులకరించే హృదయమే
ఎవరివే నువ్వనీ… వివరమే అడిగాను
బదులుగా నాకు నే దొరికితే ఏం చేయ్ ను
నన్నిలా తాకినా కెరటమే ఏదంటూ
కడలినే అడుగుతూ… వడ్డునై వేచాను
ఏడు రంగుల వాన
రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే
అక్షరాల నువ్వే
ఇన్నినాళ్ళుగ ఉన్నా
ఇప్పుడే పుడుతున్నా
కారణం ఎవరంటే
ఖచ్చితంగా నువ్వే
వినవే నందిని ఆనందిని
నువ్వే అరవిందమై నన్నే చేరినావే
నా వందనం నీకే
వినవే నందిని ఆనందిని
నువ్వే ఆనందమై నన్నే తాకినావే
నా వందనం నీకే