Waltair Veerayya Title సాంగ్ లిరిక్స్ తెలుగులో-Waltair Veerayya

Song:Waltair Veerayya Title Song

Movie:Waltair Veerayya

Singer:Anurag Kulkarni

Lyrics:Chandrabose

పాట-వాల్టేర్ వీరయ్య టైటిల్ సాంగ్

పాడినవారు-అనురాగ్ కులకర్ణి

వ్రాసినవారు-చంద్రబోస్

సినిమా-వాల్టేర్ వీరయ్య

Waltair Veerayya Title Song Lyrics in Telugu-Chiranjeevi

భగ భగ భగ భగ భగ మండే
మగ మగ మగ మగ మగాడురే వీడే
జగ జగ జగ జగ జగ చెడు జగాన్ని చెండాడే
ధగ ధగ ధగ ధగ ధగ జ్వలించు సూరీడే
అగాధగాథల అనంత లోతుల సముద్ర సొదరుడే వీడే
వినాశకారుల స్మశానమౌతాడే
తుఫాను అంచున తపస్సు చేసే.. వశిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే.. విశిష్టుడే వీడే

వీరయ్యా.. వీరయ్యా.. వీరయ్యా.. వీరయ్యా

మృగ మృగ మృగ మృగ మృగాన్ని వేటాడే
పగ పగ పగ ప్రతిధ్వనించే శతాగ్నిరా వీడే
భుగ భుగ భుగ భుగ భుగ విశాన్ని మింగాడే
తెగ తెగ తెగ తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
యెకా యెకా యెకి యముండు రాసే.. కవిత్వమంటే అది వీడే
నవ శకాన ఎర్రని కపోతమే.. వీడే
తరాలు చూడని యుగాలు చూడని సమర్థ శిఖరం.. అది వీడే
తనొంక తానే తలెత్తి.. చూస్తాడే

వీరయ్యా.. వీరయ్యా.. వీరయ్యా.. వీరయ్యా

ఢం ఢం ఢమ ఢమ అగ్ని వర్షమై.. అడుగులేసిన అసాధ్యుడే
భం భం బడ బడ.. మృత్యు జననమై ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ శౌర్య సంద్రమై.. ఆక్రమించిన అమర్త్యుడే
ధం ధం ధబ ధబ యుద్ధ శకటమై.. యెగిరి దూకిన అభేధ్యుడే
తం తం తక తక తిమిర నేత్రమై.. ఆవరించిన త్రినేత్రుడే
గం గం గడ గడ మరణ శంఖమై.. మారు మ్రోగిన ప్రశాంతుడే

వీరయ్యా.. వీరయ్యా.. వీరయ్యా.. వీరయ్యా

Waltair Veerayya Title Track Lyrics in Telugu

Leave a Comment

close