శ్రీ గోవింద నామాలు తెలుగులో

గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా |

శ్రీ శ్రీనివాసా గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సలా గోవిందా |
భాగవతప్రియ గోవిందా || ౧

నిత్యనిర్మలా గోవిందా |
నీలమేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా |
పుండరీకాక్ష గోవిందా || ౨

నందనందనా గోవిందా |
నవనీతచోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా |
పాపవిమోచన గోవిందా || ౩

దుష్టసంహార గోవిందా |
దురితనివారణ గోవిందా |
శిష్టపరిపాలక గోవిందా |
కష్టనివారణ గోవిందా || ౪

వజ్రమకుటధర గోవిందా |
వరాహమూర్తి గోవిందా |
గోపీజనలోల గోవిందా |
గోవర్ధనోద్ధార గోవిందా || ౫

దశరథనందన గోవిందా |
దశముఖమర్దన గోవిందా |
పక్షివాహన గోవిందా |
పాండవప్రియ గోవిందా || ౬

మత్స్య కూర్మ గోవిందా |
మధుసూదన హరి గోవిందా |
వరాహ నరసింహ గోవిందా |
వామన భృగురామ గోవిందా || ౭

బలరామానుజ గోవిందా |
బౌద్ధకల్కిధర గోవిందా |
వేణుగానప్రియ గోవిందా |
వేంకటరమణా గోవిందా || ౮

సీతానాయక గోవిందా |
శ్రితపరిపాలక గోవిందా |
దరిద్రజనపోషక గోవిందా |
ధర్మసంస్థాపక గోవిందా || ౯

అనాథరక్షక గోవిందా |
ఆపద్బాంధవ గోవిందా |
శరణాగతవత్సల గోవిందా |
కరుణాసాగర గోవిందా || ౧౦

కమలదళాక్ష గోవిందా |
కామితఫలదా గోవిందా |
పాపవినాశక గోవిందా |
పాహి మురారే గోవిందా || ౧౧

శ్రీముద్రాంకిత గోవిందా |
శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా |
దినకరతేజా గోవిందా || ౧౨

పద్మావతిప్రియ గోవిందా |
ప్రసన్నమూర్తీ గోవిందా |
అభయహస్త గోవిందా |
అక్షయవరద గోవిందా || ౧౩ [మత్స్యావతారా]

శంఖచక్రధర గోవిందా |
శార్ఙ్గగదాధర గోవిందా |
విరజాతీర్థస్థ గోవిందా |
విరోధిమర్దన గోవిందా || ౧౪

సాలగ్రామధర గోవిందా |
సహస్రనామా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా |
లక్ష్మణాగ్రజ గోవిందా || ౧౫

కస్తూరితిలక గోవిందా |
కాంచనాంబరధర గోవిందా |
గరుడవాహన గోవిందా |
గజరాజరక్షక గోవిందా || ౧౬

వానరసేవిత గోవిందా |
వారధిబంధన గోవిందా |
సప్తగిరీశా గోవిందా | [ఏడుకొండలవాడ]
ఏకస్వరూపా గోవిందా || ౧౭

శ్రీరామకృష్ణా గోవిందా |
రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా |
పరమదయాకర గోవిందా || ౧౮

వజ్రకవచధర గోవిందా |
వైజయంతిమాల గోవిందా |
వడ్డికాసులవాడ గోవిందా |
వసుదేవతనయా గోవిందా || ౧౯

బిల్వపత్రార్చిత గోవిందా |
భిక్షుకసంస్తుత గోవిందా |
స్త్రీపుంరూపా గోవిందా |
శివకేశవమూర్తి గోవిందా || ౨౦

బ్రహ్మాండరూపా గోవిందా |
భక్తరక్షక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా |
నీరజనాభ గోవిందా || ౨౧

హథీరామప్రియ గోవిందా |
హరిసర్వోత్తమ గోవిందా |
జనార్దనమూర్తి గోవిందా |
జగత్సాక్షిరూప గోవిందా || ౨౨

అభిషేకప్రియ గోవిందా |
ఆపన్నివారణ గోవిందా |
రత్నకిరీటా గోవిందా |
రామానుజనుత గోవిందా || ౨౩

స్వయంప్రకాశా గోవిందా |
ఆశ్రితపక్ష గోవిందా |
నిత్యశుభప్రద గోవిందా |
నిఖిలలోకేశ గోవిందా || ౨౪

ఆనందరూపా గోవిందా |
ఆద్యంతరహితా గోవిందా |
ఇహపరదాయక గోవిందా |
ఇభరాజరక్షక గోవిందా || ౨౫

పరమదయాళో గోవిందా |
పద్మనాభహరి గోవిందా |
తిరుమలవాసా గోవిందా |
తులసీవనమాల గోవిందా || ౨౬

శేషసాయినే గోవిందా |
శేషాద్రినిలయా గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా || ౨౭

గోవిందా హరి గోవిందా |
గోకులనందన గోవిందా |

Sri Govinda Namalu in Telugu

Leave a Comment

close