Sreekaram Title పాట లిరిక్స్ తెలుగులో

Song:sreekaram title song

Movie:Sreekaram

Singer:Prudhvi Chandra

Lyrics:Ramajogayya Sastry

Sreekaram Title Song Lyrics In Telugu

కనివిని ఎరుగని కదలిక మొదలైంది
అడుగులో అడుగుగా… వెతికిన వెలుగుగా
అలికిడి ఎదురయ్యింది… నిశీధినే జయించగా

శ్రీకారం కొత్త సంకల్పానికి… కళలు చిగురిస్తున్న సంతోషం ఇది
శ్రీకారం కొత్త అధ్యాయానికి…చినుకు పరిమళమల్లే దీవిస్తున్నదీ పుడమి
వారసులం మనమేగా… నిన్నటి మొన్నటి పద్దతికి
వారధులం మనమేగా… రేపటి మార్పులకీ

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫైర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

మండే ఎండకు ఫ్రెండ్ అవడం… మనకు తెలుసుగా
అలవాటే ఇక… చెమటతడి పండుగ
ఏసీ గదులకి బాయ్ బాయ్ చెప్పాము అలవోకగా
పయనం కదిలిందిలా… మనసుకు నచ్చిన దారిగా

బురదేం కాదిది… మనకిది ఒక సరదా సంబరం
నేలమ్మ ఒడిలో మనకిక… ప్రతిదినమొక పాఠం
ప్రకృతి పిలుపిది… ఇన్నాళ్ళుగా వేసిన మలుపిది
కలలకు తలపాగ చుడదాం… బంగారం పండిద్దాం

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫైర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

అచ్చంగా మనం… కంప్యూటర్ కాలం యువకులం
మెదడే ఇంధనం… చదువు మన సాధనం
సాధ్యం కానిది లేదంటుంది… ఈ మన యవ్వనం
మనసుపడి ఏ పని చేసినా… సుళువుగా రాణిస్తాం మనం

తరముల నాటిది… మన తాతలు చేసిన కృషి ఇది
తెలియనిదేం కానేకాదులే… మనకీవ్యవసాయం, హో హో
జీన్సే తొడిగినా.. మన జీన్స్ లో ఈ కళ ఉన్నదే
పదపద మొదలౌదాం… నేడే నవయువ కర్షకులై

Leave a Comment

close