సిరులను కురిపించే శ్రీలక్ష్మి song lyrics in Telugu

శ్రీలక్ష్మి
జయలక్ష్మి
సిరులను కురిపించే శ్రీలక్ష్మి
కరుణించ రావే మహాలక్ష్మి
మము కరుణించ రావే మహాలక్ష్మి

పాల కడలిలొ ప్రభవించినావు
మురిపాల మాధవుని వరియించినావు
శ్రీపతి హృదయన కొలువైతివమ్మ
నా పతి పాదాల నను నిలుపవమ్మ

అన్ని జగాలకు మూలం నీవే ఆదిలక్ష్మివమ్మా
పాడి పంటలను ప్రసాదించు నవ ధాన్యలక్ష్మివమ్మా
భీరులనైనా వీరుల చేసె ధైర్య లక్ష్మివమ్మా
జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మా
లొకము నిలిపే పాపలనిడు సంతాన లక్ష్మివమ్మా
కార్యములన్ని సఫలము చేసే విజయలక్ష్మివమ్మా
జన్మకు విద్యాబుద్దులు నేర్పే విద్యాలక్ష్మివి నీవమ్మా
సర్వ సౌభగ్య సంపదలిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మా

శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులను కురిపించే శ్రీలక్ష్మి పాట లిరిక్స్

Leave a Comment

close