ఓ నారప్ప పాట లిరిక్స్ తెలుగులో-నారప్ప

Song:Oo Narappa

Movie:Narappa

Singer:Dhanunjay & Varam

Lyrics:Ananth Sriram

పాట-ఓ నారప్ప

పాడినవారు-ధనుంజయ్ & వరం

వ్రాసినవారు-అనంత్ శ్రీరామ్

సినిమా-నారప్ప

Ooo Narappa Song Lyrics In Telugu-Narappa

ఓ ఓ ఓ ఓ నారప్ప… నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్పా
నిన్ను సూడంగానే ఇప్పారిందోయ్ నా రెప్పా
ఓ ఓ ఓ ఓ కన్నమ్మ… ఆ కంటి రెప్పై కాసుకుంట కన్నమ్మా
నీ జంటై అంటీ పెట్టుకుంట ఈ జన్మా

ఇన్నేవా ఇట్టా ఇట్టా… నా గుండె యామంటుండాదో
ఇన్యాలే ఆశల సిట్టా… హ ఎరుకే ఏమౌతుండాదో
భలేగా బాగుందే సిలకా నీ మాయ
తలకాయాడించే పిల్లకాయైపోయా
కనకే నోరూరే ఎలుగె మనపై పడుతుండాదే హొయ్యా

ఓ ఓ ఓ ఓ నారప్ప… నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్పా
నిన్ను సూడంగానే… ఇప్పారిందోయ్ నా రెప్పా
ఓ ఓ ఓ ఓ కన్నమ్మ… ఆ కంటి రెప్పై కాసుకుంట కన్నమ్మా
నీ జంటై అంటీ పెట్టుకుంట ఈ జన్మా

బళ్ళారి సంతాకెళ్ళీ… ఓ బాసాడు పల్లీల్తేనా
పల్లీల్ నువ్ తెస్తే మావ… నా పాణాలే బదులిచ్చెయ్ నా
కదిరి గుళ్ళోకి కలిసీ పోదామా
మడకసిరలోన మనువాడేద్దామా
సెరువు కానించి సక్కని గుడిసే మనమేసుకుందామా

ఓ ఓ ఓ ఓ నారప్ప… నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్పా
నిన్ను సూడంగానే… ఇప్పారిందోయ్ నా రెప్పా
ఓ ఓ ఓ ఓ కన్నమ్మ… ఆ కంటి రెప్పై కాసుకుంట కన్నమ్మా
నీ జంటై అంటీ పెట్టుకుంట ఈ జన్మా

Leave a Comment

close