ఓబులమ్మా పాట లిరిక్స్ తెలుగులో

Song:Obulamma

Movie:Kondapolam

Singer:Satya Yamini, PVNS Rohit

Lyrics:M M Keeravani

పాట-ఓబులమ్మా

పాడినవారు-సత్య యామిని, పి వి న్ ఎస్ రోహిత్

వ్రాసినవారు-ఎం ఎం కీరవాణి

సినిమా-కొండపోలం

Obulamma song lyrics in telugu-Kondapolam movie

గింజ గింజ గింజమీద… బుసుక బుసుక బుసుక తీసి
తియ్యంగా బత్తెమై పోయే
బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని
గుండుజల్లారాటపడిపోయే

ఓఓ ఓబులమ్మా..!
బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
కపర కపర రేతిరిలోనా… కాలమంతా లెక్కలుగట్టి
గుండెలోనే నీ పేరు జపమాయే
ఇదివరకెపుడూ తెలియని ఎరగని
తురుపే మైమరపిస్తూ ఉంటే
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే

కన్నులు కన్నులు వింటున్న
చూపులు చూపులు చెబుతున్న
మాటల మాటలు చూస్తున్న, మగతలలో
ఎవ్వరికెవ్వరు సావాసం… ఎక్కడికక్కడ ప్రయాణం
ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో

చదివేశాడేమో నా కలలూ… ఉంటాడే నీడై రేపవలు
తిష్టేసినాడే గోంతరాలు… పొమ్మంటే పోడే ఈడిగలు
ఓఓ ఓబులమ్మా..!
పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ

కపర కపర రేతిరిలోనా… కాలమంతా లెక్కలు తప్పి
గుండెలోనే నీ పేరు జపమాయే
ఇదివరకెపుడూ తెలియని ఎరగని
తలపే మైమరపిస్తూ ఉంటే
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే

ఓఓ ఓబులమ్మా..!
బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ
ఓఓ ఓబుళమ్మా..!
పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ

Obulamma song lyrics in telugu

1 thought on “ఓబులమ్మా పాట లిరిక్స్ తెలుగులో”

Leave a Comment

close