Ninnu Chudagane పాట లిరిక్స్ తెలుగులో-Athithi Devo Bhava

Song:Ninnu Chudagane

Movie:Athithi Devo Bhava

Singer:Anurag Kulkarni

Lyrics:Bhaskarabhatla

పాట-నిన్ను చూడగానే

పాడినవారు-అనురాగ్ కులకర్ణి

వ్రాసినవారు-భాస్కరభట్ల

సినిమా-అతిథి దేవో భవ

Ninnu Chudagane Song Lyrics in Telugu-Athithi Devo Bhava Movie

నిన్ను చూడగానే
నా గుండె జారిందే
ఉన్న ఒక్క ప్రాణం
నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే
ఈ కాలం ఆగిందే
ఉన్నట్టుండి ఈ లోకం
అందంగా మారిందే
ఒక నవ్వే కదా
ఒక చూపే కదా
ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా
నువ్వేలే నా శ్వాస
నువ్వేలే నా ద్యాస
నీతో కలిసి బ్రతకాలన్నది నాదో చిన్నఆశ
నీలో నన్ను చూసా
నాలో నిన్ను మోస
ఔనన్నా నువ్వు కాదన్నా
నా మనసే నీకిచ్చేసా

పూట పూట గురోస్తున్నావే
నీటి మీద నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే
నూటికి నూరు పాళ్ళు నచ్చేస్తున్నావే
ఈ జన్మ నీతోనే మరుజన్మ నీతోనే
వచ్చే వచ్చి గుండెల్లోనా వాలిపోవే గువ్వలా
నువ్వేలే నా ఆట
నువ్వేలే నా పాట
నువ్వుంటే నా సంతోషాన్ని వెయ్యలేను కాంట
నువ్వే ఉన్న చోట
కాదా పులా తోట
హృదయం మొత్తం రాసిచ్చేస్తా
నాకేం వద్దు వాటా

ఆగి ఆగి నువ్వే చూస్తుంటే
గుండె ఆగి ఆగి కొట్టుకుంటుందే
గాజులు ఘల్లుమని చప్పుడు చేస్తుంటే
గాయత్రి మంత్రమేదో వినిపిస్తూ ఉందే
ఈ హాయి నీ వల్లే
ఈ మాయ నీ వల్లే
నీలో నేను కలిసిపోతా గాలిలో తేమళ్లే
తిండి నిద్ర లేక
రాసా ప్రేమ లేఖ
ఎంతందంగా వేసేసావె
మనసులోన టీకా
వంద ఏళ్ల దాకా నేనే నీకు తోక
నువ్వుంటే నా లైఫ్ కి లేనే లేదు డోకా

Ninnu Chudagane Song Lyrics in Telugu

Leave a Comment

close