నీలి నీలి ఆకాశం పాట లిరిక్స్ తెలుగులో

Song: Neeli Neeli Aakasam

Movie:30 Rojullo Preminchadam Ela

Singer:Sid Sriram, Sunitha

Lyrics:Chandra Bose

పాట-నీలి నీలి ఆకాశం

పాడినవారు-సిద్ శ్రీరాం, సునీత

వ్రాసినవారు-చంద్ర బోస్

సినిమా-30 రోజుల్లో ప్రేమించడం ఎలా

Neeli Neeli Aakasam song lyrics in telugu

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా.
నెలవంకను ఇద్దామనుకున్నా..ఓ.. ఓ.. ఓ.. ఓ..
నీ నవ్వుకు సరిపోదుంటున్నా. ఆ…. ఆ … ఆ… ఆ…ఆ..

నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే

నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే

ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

ఓ..ఓ వాన విల్లులో
ఉండని రంగు నువ్వులే
ఎ రంగుల చీరను నీకు నెయ్యాలే

నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే
ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే

చెక్కిలిపై చుక్కలా దిస్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుకా
ఎంతో వెతికాను ఆశగా
ఏది నీసాటి రాదికా
అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న

ఓహో అమ్మ చూపులో
ఒలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి

దయ కలిగిన దేవుడే
మనలను కలిపాడులే
వరమసగే దేవుడికి నేను ఏం తిరిగివ్వాలి

ఏదో ఇవ్వాలి కానుక
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదికా
అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

Leave a Comment

close