Naatu Naatu పాట లిరిక్స్ తెలుగులో-RRR సినిమా

Image Credit: Lahari Music
Song:Naatu Naatu

Movie:RRR

Singer:Rahul Sipligunj, Kaala Bhairava

Lyrics:Chandra Bose

పాట-నాటు నాటు

పాడినవారు-రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ్

వ్రాసినవారు-చంద్ర బోస్

సినిమా- RRR

Naatu Naatu Song lyrics in Telugu-RRR movie

పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు

కిర్రు సెప్పులేసుకొని… కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన… కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన… మిరపతొక్కు కలిపినట్టు

నా పాట సూడొ
నా పాట సూడొ
నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు

గుండెలదిరిపోయేలా… డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ… కీసుపిట్ట కూసినట్టు

ఏలు సిటికలేసేలా… యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా… దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా… వీరంగం సేసినట్టు

నా పాట సూడొ
నా పాట సూడొ
నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు ఉక్కపోతలాగ తిక్క నాటు

భూమి దద్దరిల్లేలా… ఒంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా… ఏసేయ్ రో ఎకాఎకీ
నాటు నాటు నాటో, వాహా ఏస్కో

అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా… డుముకు డుముకులాడే
దూకెయ్ రా సరాసరి… నాటు నాటు నాటో

Naatu Naatu Song lyrics in Telugu

Leave a Comment

close