Movie:Sridevi Soda Center
Singer:Dinker Kalvala,Ramya Behra
Lyrics:Sirivennela Seetharama Sastry
పాడినవారు-డింకర్ కల్వల, రమ్య బెహ్రా
వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సినిమా-శ్రీదేవి సోడా సెంటర్
Naalo Innalluga song lyrics in Telugu-Sridevi Soda Center movie
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ
అదో ఇబ్బందిగా అనిపించినా… అది కూడా బానే ఉంది
మరి కన్నెర్రగా కసిరేసినా… చిరునవ్వులా ఉందే
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానే అందేనా
ఎంతో దూరాన ఉండే ఆ తారకా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ
కొంచం గమనించదేం… దరిదాపుల్లోనే తారాడినా
వైనం గురుతించడేం… కనుబొమ్మతోనే కబురంపినా
ఎలా చెప్పాలో వయస్సేమందో… ఎలా చూపాలో రహస్యం ఏదో
ఇదేమి చిక్కో… నువ్వే కనుక్కో
తెగిస్తా, వరిస్తా… మరెందుకని పరాకనీ
లేపే కిరణాల పిలుపే… తొలిమేలు కొలుపై నను గిల్లగా
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ
పోన్లే పాపం అని… దరి దాటి రానా నది హోరుగా
సర్లే కానిమ్మనీ… చుట్టేసుకోనా మహాజోరుగా
అలా కాకుంటే మరో దారుందా
ఇలా రమ్మంటే కలే రానందా
తయారయుందాం… తథాస్తు అందాం
అటైనా, ఇటైనా… చెరె విడే హడావిడీ
తరిమే తొలివాన చినుకో మురిపాల
మునకో నను అల్లగా
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానేనె తందానే తానే తననానే తానే తననానేనా
తానే తన్నానే తానే తననానే తానే తననానేనా