Manninchava Amma సాంగ్ లిరిక్స్ తెలుగులో Writer Padmabhushan

Song:Manninchava Amma

Movie:Writer Padmabhushan

Singer:Karthik, Kalyan Nayak

Lyrics:Koti Mamidala

పాట-మన్నించవా అమ్మ

పాడినవారు-కార్తీక్, కళ్యాణ్ నాయక్

వ్రాసినవారు-కోటి మామిడ్ల

సినిమా-Writer Padmabhushan

Manninchava Amma Song Lyrics in Telugu-Writer Padmabhushan

ఆనందాల ఆకాశమే
అందిస్తావు నాకోసమే
అమ్మ నీకు ఏమివ్వనే
నువ్వే అడగవా
నను కాస్తావు కాను పాపలా
నను చూస్తావు నీ రేపులా
అయిపోతావు నా ఆటకి నువ్వే బొమ్మలా
నా నిదుర కోసం జోలాలి జో జో
నను మరచి పొందే నిదురంటూ ఏ రోజు
కలలన్ని మోసి
నువ్వు కన్న రాజు
అని మురిసిపోవా నను చూస్తూ ప్రతి రోజు
నీ ప్రాణం పంచావే ఒక నిండు జన్మలా
ఎవరైనా ఉంటారా భువిపైన అమ్మలా
ఓ పాదాలకే పది విధాలు
నేర్పిన వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగ యుగాలకి
వినిపించని కథ అమ్మ
నా పాదాలకే పది విధాలు
నేర్పిన వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగ యుగాలకి
వినిపించని కథ అమ్మ

నీ ఒడిని బడీగా చేసి
ఎన్నో కళలు నేర్పావు
నా కలలను ముందే చదివి కథగా రాసావు
నీ కనులలో నను దాచి
లోకం నాకు చూపించి
నా ఊహల లోకంలో నువ్వు బ్రతికేస్తున్నావు
మన్నించవా నన్ను ఓసారి అమ్మ
నీకోసం నేను చేసిందేంలేదమ్మా
అడగాలని ఉంది అడిగేనా అమ్మ
ఏ జన్మకైనా నన్నే కనవే అమ్మ
నీకేవో కావలి అని అడగలేదుగా
నీలోనే నేనున్నాగమనించలేదుగా
ఓ పాదాలకే పది విధాలు
నేర్పిన వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగ యుగాలకి
వినిపించని కథ అమ్మ
నా పాదాలకే పది విధాలు
నేర్పిన వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగ యుగాలకి
వినిపించని కథ అమ్మ

Manninchava Amma Song Lyrics

Leave a Comment

close