Mangli Bathukamma Song 2023 లిరిక్స్ తెలుగులో-Mangli

Song:Mangli Bathukamma Song

Singer:Mangli

Lyrics:Kasarla Shyam

పాట-మంగ్లీ బతుకమ్మ సాంగ్

పాడినవారు-మంగ్లీ

వ్రాసినవారు-కాసర్ల శ్యామ్

Mangli Bathukamma Song 2023 Lyrics in Telugu

కొప్పులోని పూబొమ్మ
బాయి కాడి బొడ్డెమ్మా
కొప్పులోని పూబొమ్మ
బాయి కాడి బొడ్డెమ్మా

గంగా ధాటి పోకమ్మో
గంగితాలి కమలమ్మ
గంగా ధాటి పోకమ్మో
గంగితాలి కమలమ్మ

శేను గట్ల పూబమ్మ
ఉషికెలోని గౌరమ్మ
శేను గట్ల పూబమ్మ
ఉషికెలోని గౌరమ్మ

శిట్టి మరిశిపోకమ్మో
డప్పుమంటూ కాంతమ్మ
శిట్టి మరిశిపోకమ్మో
డప్పుమంటూ కాంతమ్మ

పెద్దమాస పొద్దుల్లో
రాగి వంటి మబ్బుల్లో
అడుగే పెడితే మా తల్లో
పసుపు కంచె ఎన్నెల్లో
ముంగిటా ముగ్గు సుక్కల్లో
ఎంగిలి పూల బతుకమ్మలో

కొప్పులోని పూబొమ్మ
బాయి కాడి బొడ్డెమ్మా
గంగా ధాటి పోకమ్మో
గంగితాలి కమలమ్మ

రెండో నాడు రేనమ్మ
అటుకులిస్తా లక్షమ్మ
రెండో నాడు రేనమ్మ
అటుకులిస్తా లక్షమ్మ

మూడో నాడు ముద్దేంతా
ముద్ద పప్పుదే శాంతా
నాల్గొద్దులల్ల సందెల్లు
నేనేసి భియ్యమియ్యుల్లో
నాల్గొద్దులల్ల సందెల్లు
నేనేసి భియ్యమియ్యుల్లో

ఐదోతనము కైలమ్మ
అట్టు జేసి పెట్టమ్మా
ఐదోతనము కైలమ్మ
అట్టు జేసి పెట్టమ్మా

అర్రెమెలే నాగమ్మ
అలిగి ఉంటె గౌరమ్మ
కైవ్వే చాలు అత్తమ్మ
నేలకి పూజ సాలమ్మ
ఏడు యేపకాయ్యల్లో
తోడు పంచు పుణ్యాలు

నాగా మునింజల్లో
సూనాలేశే కంతుల్లో
గడప కడగవే పిల్లో
కోరి దివేనర్థుల్లో

కొప్పులోని పూబొమ్మ
బాయి కాడి బొడ్డెమ్మా
గంగా ధాటి పోకమ్మో
గంగితాలి కమలమ్మ

యేండి గిన్నె ఏతకమ్మా
యెన్న మూద్దా చిలకమ్మా
యేండి గిన్నె ఏతకమ్మా
యెన్న మూద్దా చిలకమ్మా
నీ మీదింత నువ్వుల్లో
ఎంత జల్లునోయమ్మ

పైడి గొలుసు ఉయ్యాల్లో
పగడాలంటి పాపల్లో
పైడి గొలుసు ఉయ్యాల్లో
పగడాలంటి పాపల్లో
నిండా తోమిదోద్దుల్లో
పండే నోచె నోముల్లో
నిండా తోమిదోద్దుల్లో
పండే నోచె నోముల్లో

గునుగు పూల మేనాలో
గురిగి తంగేడు పూలో
సత్తు ముంత సారేల్లో
తరాలి పోయే అధ్ధిల్లో
వాయినాలు పచ్చంగా
ఏడాది ఏదురు సూడంగా

కొప్పులోని పూబొమ్మ
బాయి కాడి బొడ్డెమ్మా
కొప్పులోని పూబొమ్మ
బాయి కాడి బొడ్డెమ్మా
గంగా దాటి పోకమ్మో
గంగితాలి కమలమ్మ

పోయి రావే బతుకమ్మ
బతుకుజేను గంగమ్మ
పోయి రావే బతుకమ్మ
బతుకుజేను గంగమ్మ

నీల కొంగు సాపిందే
తోల్కబోను మా అమ్మ
నీల కొంగు సాపిందే
తోల్కబోను మా అమ్మ

Listen to Mangli Bathukamma Song 2023

Leave a Comment

close