Movie:Sridevi Soda Center
Singer:Sahithi Chaganti, Dhanunjaya
Lyrics:Kasarla Shyam
పాడినవారు-సాహితి చాగంటి, ధనుంజయ
వ్రాసినవారు-కాసర్ల శ్యామ్
సినిమా-శ్రీదేవి సోడా సెంటర్
Mandhuloda song lyrics in Telugu-Sridevi Soda Center
అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అయితే…
సింగపూర్ రంగబాబు ఫ్లైట్ ఎక్కమన్నాడు
ఉంగరాల గంగిరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు
తిక్కరేగి యమబాబు ముహర్తలు పెట్టేసి
పెద్దూరి నాయుడుతో పెళ్లి చేసినారురో
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల చిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల చిన్నోడా
పెద్దూరి నాయిడుకి నిన్నిచ్చి పెళ్లి చేస్తే
మద్దూరి పెద్దిరెడ్డి మద్దెల వాయించినాడే
సిన్నురి సిట్టిబాబు చిడతలు కొట్టాడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల చిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల చిన్నోడే
నా మొగుడు నాయుడు ఏ పనిపాట సేయ్యకుండా
మూలికలు వేర్లు తేత్తానని అడువులు పట్టుకుపోయి
నన్ను మరిసె పోనాడు
అవునా ఏ ఊర్లు ఎల్లాడు ఎం తెచ్చాడు
తూర్పు ఎల్లాడు తుమ్మేరు తెచ్చాడు
పడమర ఎల్లాడు పల్లేరు తెచ్చాడు
దచ్చనమెల్లాడు దబ్బెరు తెచ్చాడు
ఉత్తరమెల్లాడు ఉల్లేరు తెచ్చాడు
మందులు మందులు అని మాయమై పోయినాడు
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల చిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల చిన్నోడా
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల చిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళి రాడే మందుల చిన్నోడే
పైటే పట్టమంటే పల్లేరు తెచ్చాడా
నడుమే గిల్లమంటే నల్లేరు అల్లాడా
ముద్దులు పెట్టమంటే మూలికలు ఇచ్చాడా
ముచ్చట తీర్చమంటే మూడుర్లు తిరిగాడా
మేమున్నమే పిల్లా వద్దు నీకు మందు మాకు
మందులోడా ఓరి మాయలోడా
మామ రాకు మందుల చిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మళ్ళి రాకు మందుల చిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల చిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల చిన్నోడా