మనసులోనే నిలిచిపోకే పాట లిరిక్స్ తెలుగులో-Varudu Kaavalenu

Song:Manasulone Nilichipoke

Movie:Varudu Kaavalenu

Singer:Chinmayee Sripada

Lyrics:Sirivennela Seetharama Sastry

పాట-మనసులోనే నిలిచిపోకే

పాడినవారు-చిన్మయి శ్రీపాద

వ్రాసినవారు- సిరివెన్నెల సీతారామశాస్త్రి

సినిమా-వరుడు కావలెను

Manasulone Nilichipoke Song Lyrics in Telugu-Varudu Kaavalenu

మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా

ఎన్నిన్నాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్ని వైపులా వెనుతరిమే ఈ సంబరం
అదును చూసి అడగదేమి… లేనిపోని బిడియమా
ఊహలోనే ఊయలూపి… జారిపోకే సమయమా
తడబడే తలపుల తపన… ఇదని తెలపకా

మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా

రా ప్రియా శశివదనా… అని ఏ పిలుపు వినబడెనా
తనపై ఇది వలనా… ఏదో భ్రమలో ఉన్నానా
చిటికే చెవిబడి తృటిలో మతి చెడి
నానా యాతన మెలిపెడుతుండగా

గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మమగమాప
గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మపనిదపమా

నా ప్రతి అణువణువు
సుమమై విరిసే తొలి ఋతువు
ఇకపై నా ప్రతి చూపు… తనకై వేచే నవ వధువు
చెలిమే బలపడి రుణమై ముడిపడే
రాగాలాపన మొదలవుతుండగా

మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా

Manasulone Nilichipoke Song Lyrics in Telugu

Leave a Comment

close