Malupu Female Version పాట లిరిక్స్ తెలుగులో

Song:Malupu Female Version

Singer:Vyshu Maya

Lyrics:Suresh Banisetti

పాట-Malupu Female Version

పాడినవారు-వైషు మాయ

వ్రాసినవారు- సురేష్ బనిశెట్టి

Malupu Female Verion Lyrics in Telugu-Deepti sunaina,shanmukh jaswanth

మనసులో ఒక అలజడి… మొదలయే తొలిగా
ఎవరికీ కనిపించనీ… కన్నీరే కురిసేనుగా
ఎదురుగా నువు లేవని… దిగులుగా నలిగా
నిమిషమూ నరకము కదా… ముందెపుడూ ఎరుగనుగా

మరిచిపోలేనులే విడిచిపోలేనులే
నీ గుండెల్లోంచి దూరం నడిచి పోలేనులే
మరిచిపోలేనులే విడిచిపోలేనులే
తడి కన్నుల్తోనే కాలం గడిచీ పోతోందిలే

పిలిచినా ఆఆ ఆ ఆ
పలకవా ఆఆ ఆ ఆ
మరిచినా ఆఆ ఆ ఆ
వదలవా ఆఆ ఆ ఆ

ఈ పిలుపు విని ఎన్నాళ్ళయ్యిందో
ఒకసారి నాతో మాటాడొచ్చు కదా
నువు లేకుండా బతికేం చేయను
అది కూడా నువ్వే చెప్పెల్లొచ్చు కదా

నిజమై నువ్వే త్వరగా రాకుంటే
ఇలలో నేనే మిగిలిపోతాలే
వింటున్నావా నాలో బాధ..?
వింటే రావా..?, ఆఆ ఆ
పిలిచినా ఆఆ ఆ ఆ
పలకవా ఆఆ ఆ ఆ

మనసుకేమీ అలికిడి… వినబడే తిరిగా
ఇక మరి నా మనసు… ఓ పడమై కుదరదుగా
వెలితినే వెలివేయగా వెన్నెలై వెలిగా
కలతలే కరిగించెద… కౌగిలినే వరమడిగా

మరిచిపోలేనులే విడిచిపోలేనులే
నా ప్రాణంనిండా నువ్వే నిలిచిపోయావులే
మరిచిపోలేనులే విడిచిపోలేనులే
నీ చేతుల్లోన చెయ్యే పరచి చెప్పానులే

Malupu Female Verion Lyrics in Telugu

Leave a Comment

close