Mallika Mallika సాంగ్ లిరిక్స్ తెలుగులో-Shaakuntalam Movie

Song:Mallika Mallika

Movie:Shaakuntalam

Singer:Ramya Behara

Lyrics:Chaitanya Prasad

పాట-మల్లికా మల్లికా

పాడినవారు-రమ్య బెహరా

వ్రాసినవారు-చైతన్య ప్రసాద్

సినిమా-శాకుంతలం

Mallika Mallika Song Lyrics in Telugu-Shaakuntalam Movie Samantha

మల్లికా మల్లికా
మాలతి మాలికా
చూడవా చూడవా ఏడి నా ఏలిక
మల్లికా మల్లికా
మాలతి మాలికా
చూడవా చూడవా ఏడి నా ఏలిక
హంసికా హంసికా
జాగునే సేయకా
పోయిరా పోయిరా
రాజుతో రా ఇక
అతనికో కానుక ఈయన నేనిక
వలపుకే నేడిక వేడుక కాగా
ఆహ నీలవేణి
పూచే పూల ఆమని
రాజే చెంత చేరా రాజ్యాన్నేలు మా రాణి
మునుల ఘనుల మన వన సీమ
మారుని శరము పరమా
మధుర సుధల సుమమా
మనసు నిలుపతరమా
స్వప్నికా చైత్రికా
నా ప్రియా నేత్రికా
చూడవా చూడవా ఏడి నా ఏలిక

సాగుమా మేఘమా
సాగుమా మేఘమా
స్వామినే చేరుమా
వాననే వీణాలై మా కథే పాడుమా
నీ చెలీ నెచ్చెలి చూలు దాల్చిందని
శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా
మిల మిల మెరిసెలే శారదాకాశమే
వెలవెలా వెన్నెలై
వేగె మా ప్రేమే
తార తోరణాలై
తీర్చే నింగి దారులే
నేలే పాలపుంతయి నింపే ప్రేమ దీపాలే
మారుల విరుల రసఝరి లోనా
మనసు తడిసె లలనా
అమల కమల్ నయాన
తెలిసే హృదయ తపనా
ఆకులో ఆకునై
ఆశ్రమ వాసివై ఆశగా చూడనా
అతని రాకకై

ఓ చెలి చెలీ
ఎందుకె ఈ చలి
భూతలం నా మది శీతలం అయినది
మంచులో ముంచిన
ఎంత వేధించినా
అతని అంశనే వెచ్చగా దాచని
శిశిరమె ఆశలా ఆకులే రాల్చిన
చిగురులు వేయగా చైత్రమే కానా
హేమంతాలు ఎలా
సీమంతాల వేళలో
చిందే ఎలా బాల
వాసంతలే నీలోనా
నెలలు గడచినవి నెలబాల
కదలి కడలి అలలా
అమర విమల సుమమా
సుగుణ మణిని కనుమా
కన్నులే వేచేలే కాయలే కాచేలే
ఆశగా చూడగా
అతని రాకకై

Mallika Mallika Song Lyrics in Telugu-Shaakuntalam Movie-Samantha,Dev Mohan

Leave a Comment

close