Movie:Sita Ramam
Singer:Anurag Kulkarni, Sinduri S
Lyrics:Sirivennela Seetharama Sastry
పాడినవారు-అనురాగ్ కులకర్ణి, సిందూరి ఎస్
వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సినిమా-సీతా రామం
Kaanunna Kalyanam Song Lyrics in Telugu-Sita Ramam Movie
కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరో వరం
విడువని ముడి ఇది కదా
ముగింపులేని గాధగా
తరముల పాటుగా, ఆ ఆ
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా
ప్రణయమునేలగా సదా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
చుట్టు ఎవరూ ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా
గట్టిమేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా టెన్ టు ఫైవ్
అవా..! సరే..!!
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట..!
బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో
సరే మరి.!
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ