Movie:JaiHo Indians
Singer:Yazin Nizar
Lyrics:Kasarla Shyam
పాడినవారు-యాజిన్ నిజార్
వ్రాసినవారు-కాసర్ల శ్యామ్
సినిమా-JaiHo Indians
Jaiho Anthem Song lyrics in Telugu-Jaiho Indians movie
గమ్యం తెలియని నా దేశంరా
అడిగేదెవ్వడు ఆపేదెవ్వడు
సహనం మరిచిన నా దేశంరా
తెల్ల దొరల మెడలు వంచి
అర్ధరాత్రి కట్లు తెంచి
రెక్క విప్పి పావురంలా
స్వేచ్ఛగా నింగికి ఎగిరెనురా
మతం కత్తి మొనలు దూస్తే
కులం నెత్తురంత పూస్తే
మానవతను మంటలేస్తే
నా దేశం కుమిలెనురా
ఇది నా దేశంరా… జగమంతా తల్లిరా
తన పిల్లలు ఎదలో గుచ్చెను ముళ్ళులురా
ఇది నా దేశంరా… ఒక తులసి వనంరా
ఇది నేలన పెరిగెను పిచ్చిగ మొక్కలురా
ఓ ఓ, కళ్ళముందు ఒళ్ళు కాలుతూ
నిప్పుల కొలిమే నడి వీధి
ఆర్పకుండా ఆట చూస్తావేం కళ్ళారా
ఆ ఆ, రాతిగుళ్ళో నూనె నింపుతూ
వెలుగుతుంటే నిత్య దీపమే
ఆరకుండా చూస్తే పుణ్యమా సోదరా
ఆఆ, ఒక పూట తిండి లేక
ఈ డొక్కలెండుతున్నా
అభిషేకం చేస్తారే
ప్రతి పాము పుట్ట వెతికి
తన కడుపు నిండి ఉన్నా
ఇక చోటు లేదు అన్నా
పక్కోడి ముద్దనే లాగేస్తారు ఉరికి
చల్ పదరా చల్ పదరా
నీ చేబుల ఉన్న బోసి తాతనే
సీసాకై తీసి ఊగెయ్ రా
నీ దేశం నీ మోసం
అడుగడుగున రంగులు మార్చెయ్ రా
ఏదైనా ఈ దేశం తన వడినే నీకై పంచునురా
ఇది నా దేశంరా… ఒక సిరుల పంటరా
అనునిత్యం దోబిడి గురుతులనే కనరా
ఇది నా దేశంరా… ఒక శాంతి దూతరా
ప్రతి నిమిషం దాడుల ఏడుపులే వినరా
ఈ మట్టి నీకు పుట్టుకిచ్చేరా
రక్తపు మడుగుల మునిగేరా
పాలు తాగి విషము చిమ్ముతూ బ్రతుకకురా
నా అన్నదమ్ములంటూ నమ్మితే
తన్నులాటకొస్తవెందుకు
అమ్మ ప్రేమ అమ్మకానికి కాదురా
నీకు ప్రార్థనంటే తెలుసా
మత గ్రంథమంటే హింసా
మన కోసం తమ ప్రాణం
అర్పించినోళ్ళు అలుసా
నా జెండా నేను మోశా
నా గుండెలోన దాచా
నా కలల భారతం రేపటికై చూశా
జై అనరా జై అనరా
నిను చల్లగ చూసిన ఇల్లే కదరా
ముసుగే విసిరేసి మనసారా
నిలదీస్తాం తరిమేస్తాం
మా ఊపిరి చప్పుడు ఉప్పెనరా
ఈ దేశం మా సొంతం
మేమొక్కటయ్యే క్షణమొవచ్చెనురా
ఇది నా దేశంరా… జనగణ గీతంరా
జయహో జనని మేర చాంద్ సె హై ప్యారా
ఇది నా దేశంరా… ఎహ్ షాన్ హే మేరా
వందేమాతరమే భవితకు మంత్రంరా