ఎంతో మారి, తన చెంతే చేరి
బ్రతుకంతా తోడు నిలవాలని
ఎన్నో నేను అనుకున్నా కానీ
కథ అంత తారుమారాయనే
గాయం చేసేసావే… ఐనా బాధే లేదే
కానీ మాటే జారీ… ఊపిరాపేసావే
తప్పే నీది కాదే… నాది కూడా కాదే
కాలం ఆడే ఆటేలే
నిను చూడక కన్నులే… కునుకేయను అన్నవే
గొడవేంటో వాటికి… గురుతె లెనే లేదులే
అసలేయదు ఆకలే… అని నేననలేనులే
తెలియనొక వేదనే… కూడుని జారనియ్యదే
నువ్వే చెంత లేక… నాలో నేనే లేనే
భారం ఐయినది ప్రాణమే
నిన్నే చేరలేక… నాలో అగలేక మూగే పోయినవే మాటలే
నీకే గాయం ఐతే… నాలో బాధే చేరి
కోపం తెప్పించిందే… నాతప్పు కానే కాదే
అయినా దూరం చేసి
బాధే పెంచేసావే… భారమాయే ప్రాణమే
ఒక్కసారిగా ప్రేమనే, ఒక్కసారిగా భాదనే
కురిపించి ఆటలు… ఆడే వింత కాలమే
కథలే ఎన్ని చూసినా… ఇది మాత్రము మారదే
మలుపు లేని కధలను… కాలమే రాయలేదులే
అంతా క్షేమమని ఆనందించిలోపే
చింతే చెంతకె చేరునే
తప్పేలేదు ఇదే లోకం తీరు
అంటూ కాలం చేసేనే గారడీ
గాయం చేసే కాలం… మళ్ళీ చేసే వైద్యం
కాలక్షేపం కోసo… ఆడేటి ఆటేనేమో
చేదే చూడకుంటే… తీపి తీపేకాదే
కాలం నేర్పే పాటమే