Gandhari పాట లిరిక్స్ తెలుగులో-Gandhari movie

Song:Gandhari

Movie:Gandhari

Singer:Ananya Bhat

Lyrics:Suddala Ashok Tej

పాట-గాంధారి

పాడినవారు-అనన్య భట్

వ్రాసినవారు-సుద్దాల అశోక్ తేజ్

సినిమా-గాంధారి

Gandhari Song Lyrics in Telugu-Gandhari Movie

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
చెంగు చెంగునొచ్చి హోలీ రంగు చల్లిండే

పోయినఏడు ఇంత పోకిరి కాదు
రైకల వాసనా తెలియనివాడు
ఇంతలోపల ఏమి జరిగెను
సూదుల సూపుతో గుచ్చుతున్నాడే
గాంధారి నీ మరిది ఏందేందో చేసిండే
సింధూరి చెంపకు సిరి గంధం పుసిండే

గాంధారి నీ మరిది
గందరగోళం సందడి
మందిలోన ఎట్లా చెప్పమందు వాని అంగడి
సుందరి బొమ్మనట
మందారం రెమ్మనట
పిందెలాగా ఉండే లంక బిందె వంటంటే
కందిరీగ నడుమంట
కందిపూలు ఒళ్ళంట
ఎందుకిట్లా ఎండలోన
కందిపోతున్నవని అందెపుడి భుజాలకి
కుసుందు రమ్మంటే

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
చెంగు చెంగునొచ్చి హోలీ రంగు చల్లిండే

బంగార సీతారామ సింగరా లగ్గానికి
చెంగాబి చీర కట్టి
మంగళారతి ఇస్తాంటే
రంగు చల్లి ఎదురుకోళ్ల పండగంటంటే
పండుగ ఏదైనా రంగు పండగనే అంటాండే

గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ చందమామ లాగా వొంగి చూసిండే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
చెంగు చెంగునొచ్చి హోలీ రంగు చల్లిండే

Gandhari Song Lyrics in Telugu-Keerthy Suresh

Leave a Comment

close