Gaana of Republic పాట లిరిక్స్ తెలుగులో

Song:Gaana of Republic

Movie:Republic

Singer:Anurag Kulkarni, Dhanunjay, Hymath Mohammed, Aditya Iyengar, Prudhvi Chandra

Lyrics:Rahman

పాట-Gaana of Republic

పాడినవారు-అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హిమాత్ మహమ్మద్, ఆదిత్య అయ్యంగార్, పృధ్వీ చంద్ర

వ్రాసినవారు- రెహమాన్

సినిమా-రిపబ్లిక్

Gaana of Republic Song lyrics in Telugu-Republic movie

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

నా ప్రాణంలోని ప్రాణం… నా దేహంలోని దాహం
నా మౌనం పాడే గానం… నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నెరా
లక్ష అక్షరాలు రాయలేని కవితరా
ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్చరా

నా కళ్ళలోన రంగుల కలరా, ఆ ఆఆ
నా కళ్ళలోన రంగుల కలరా
నా ఊహలకే ఉనికే తనురా
నా బతుకులోన బాగం కదరా
నా ఊపిరికే అర్థం తనురా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

తెల్లవాడినెదిరించి నల్లని చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే, ఏ ఏ
అంతలోనే తెలిసిందది మాయమై పోయిందని
ముందుకన్నా ముప్పుఉన్న పంజరానా ఉన్నదని

అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా
ఏ పోరాటంతో దానిని చేరాలిరా, ఆ ఆఆ
ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

అనాదిగా ఎవడో ఒకడు… అది నాకే సొంతమంటూ
నియంతలై నిరంతరం… చెరలో బంధించారు, ఊఊ ఊ
రెక్కలనే విరిచేసి… హక్కులనే చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని… అణిచి అణిచి వేసినారు

నరజాతి చరిత్రలో నలిగిపోయెరా
చల్లారని స్వాతంత్య్ర కాంక్ష స్వేచ్చరా
నరనరాల్లోనా ప్రవహించే ఆర్తీరా, ఆ ఆఆ
కనిపించక నడిపించే కాంతిరా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ||2||

ఏయ్ రారో ఎయ్ పాట లిరిక్స్ తెలుగులో

Leave a Comment

close