ఏమిటో ఇది పాట లిరిక్స్-రంగ్ దే

Song:Emito Idhi

Movie:Rang De

Singer:Kapil Kapilan & Haripriya

Lyrics:Shree Mani

పాట-ఏమిటో ఇది

పాడినవారు-కపిల్ కపిలాన్ & హరిప్రియా

వ్రాసినవారు-శ్రీ మణి

సినిమా-రంగ్ దే

Emito Idhi song lyrics in Telugu

ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది…
అందుకే ఈ మౌనమే… భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది…

ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది

అలలా నా మనసు తేలుతుందే… ఏఏ ఏ
వలలా నువు నన్ను అల్లుతుంటే… ఏఏ ఏ
కలలా చేజారిపోకముందే… ఏఏ ఏ
శిలలా సమయాన్ని నిలపమందే… ఏఏ ఏ
నడక మరిచి నీ అడుగు ఒడిన… నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన… నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ… ఓఓఓ ఓ

ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో… ఓఓ ఓ
కలిపే ఒక కొత్త నిన్ను నాతో… ఓఓ ఓ
నేనే ఉన్నంత వరకు నీతో… ఓఓ ఓ
నిన్నే చిరునవ్వు విడవదనుకో… ఓఓ ఓ
చినుకు పిలుపు విని… నెమలి పింఛమున రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిన్ని మనసు… చిందేసే ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది… ఓఓఓ ఓ

ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది

Leave a Comment

close