Movie:Lambasingi
Singer:Mangli
Lyrics:Raghuram
పాడినవారు-మంగ్లీ
వ్రాసినవారు-రఘు రామ్
సినిమా-లంబసింగి
Dola Re Song Lyrics in Telugu-Lambasingi Movie 2022
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా
చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా
ఏలో ఏలో ఏలో… ఎన్నెలలే వచ్చెను యాలో
ఊరంతా ఊగిపోయేలాగా… సిందేవేయాలో
హే, కోలో కోలో కోలో… సరదాల కోలాటంలో
జనమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యే గోలే సెయ్యాలో
హే, సిన్నా పెద్దా తేడాలన్నీ మరిసిపోవాలో
అరె, సుట్టూ సేరి సుట్టాలందరు ఆటే ఆడాలో
డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా… సందల్లే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా… నాట్యాలే ఎన్నో సెయ్యాలా
అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా
చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా
హే, ఆకాశంలో మేఘం
అరె చేసిందేమో ఆగం
కనుకే మనకై చినుకై కురిసిందే
ఇంతటి సంతోషం
గుండెల్లోనా వేగం
పెంచిందే ఈ అనురాగం
అంబరమే అంటే సంబరమే
పలికిందే ఆహ్వానం
గింగిర గిర గిర బొంగరమై
మనసే తిరిగేసిందే
చెక్కిలి గిలి గిలి గిలిగింతలు
ఎన్నెన్నో పెంచిందే టెన్ టు ఫైవ్
కొండకోనల్లో స్వచ్ఛమైన ప్రేమే చూడగా
కొత్త గాలేదో దారే మారి మా ఇల్లే చేరిందిగా
డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా… సందల్లే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా… నాట్యాలే ఎన్నో సెయ్యాలా