Dhada Dhada పాట లిరిక్స్ తెలుగులో-The Warrior

Song:Dhada Dhada

Movie:The Warriorr

Singer:Haricharan

Lyrics:Shreemani

పాట-దడ దడ

పాడినవారు-హరిచరణ్

వ్రాసినవారు-శ్రీమణి

సినిమా-The Warriorr

Dhada Dhada Song Lyrics in Telugu-Ram,Kriti Shetty

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నువ్వు విసిరినా విజిల్ పిలుపొక
గజల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే

తెలియదు కదా పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడు నేనే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నలుపని తెలిసి…కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే…నీకై పొంగే
నా హృదయాన్నె మరి కసిరేస్తావే….

ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తావే
ఎటు వెళ్లని వల వేస్తావే
ఏంచేశానంటూ నను నిలదీస్తావే
ఏం చేయలేక చూస్తూ ఉంటె జాలి చూపవే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం, హ హా
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇకడే ఉన్నావని అర్ధం

తేనెలో పడడం చీమకు ఇష్టం
నీ ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం

రాసిన రాతైనా మళ్ళీ రాస్తున్న
విసుగుండదు ఇది ఏం కవితో
రోజు చూస్తున్నా మళ్ళీ వస్తున్న
నిను ఎంత చూడు కనులకసలు తనివి తీరదే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

Dhada Dhada Song Lyrics in Telugu

Leave a Comment

close