ఎన్ని లోకముల వెదకి చూచినా లేనే లేదురా
దయగల తల్లికి మించిన దైవము వేరే లేదురా
ఎన్ని లోకముల వెదకి చూచినా లేనే లేదురా
అప్పుల పాలై ఆస్తులు
పోయి నా యను వారే కరువైన
అప్పుల పాలై ఆస్తులు
పోయి నా యను వారే కరువైన
చెట్టు విడిచిన పక్షి విదాన కాలం గడిపెనా
దయగల తల్లికి మించిన దైవము వేరే లేదురా
ఎన్ని లోకముల వెదకి చూచినా (లేనే లేదురా2)
కుటుంబ బాధల క్రుంగీ
కృశించి జీవితాశాయే దిగజారి
కుటుంబ బాధల క్రుంగీ
కృశించి జీవితాశాయే దిగజారి
అన్యాయంగా నిండు ప్రాణమును ఆహుతి జేసేనా
అన్యాయంగా నిండు ప్రాణమును ఆహుతి జేసేనా
మాతృదేవతని మన్నన చేసి పూవులలోన పూజించి
మాతృదేవతని మన్నన చేసి పూవులలోన పూజించి
అభిమానంతో కొలిచే భాగ్యం అందరి కబ్బే నా
దయగల తల్లికి మించిన దైవము వేరే లేదురా
ఎన్ని లోకముల వెదకి చూచినా (లేనే లేదురా2)
దయగల తల్లికి మించిన దైవము వేరే లేదురా
ఎన్ని లోకముల వెదకి చూచినా లేనే లేదురా
గర్భ వాశమున కనిపెంచి
ముద్దు ముచ్చటలను లాలించి
చదువు సాములా చెప్పించి
సర్వం నీవని భావించి
చల్లని చూపుల సంరక్షించే జననికి సాటెవరు
దయగల తల్లికి మించిన దైవము వేరే లేదురా
ఎన్ని లోకముల వెదకి చూచినా (లేనే లేదురా2)
దయగల తల్లికి మించిన దైవము వేరే లేదురా
ఎన్ని లోకముల వెదకి చూచినా (లేనే లేదురా3)