చుక్కల మేళం దిక్కుల తాళం పాట లిరిక్స్

Song:Chukkala Melam

Movie:Sridevi Soda Center

Singer:Anurag Kulkarni

Lyrics:Kalyan Chakravarthy

పాట-చుక్కల మేళం దిక్కుల తాళం

పాడినవారు-అనురాగ్ కులకర్ణి

వ్రాసినవారు-కళ్యాణ్ చక్రవర్తి

సినిమా-శ్రీదేవి సోడా సెంటర్

Chukkala Melam song lyrics in telugu

ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ
చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం వాసంతం

అక్కరలేక అక్కున చేరే దక్కని చొరవేరా
లెక్కలు వేసి ముక్కలు చేస్తే విలువ మరుగేరా
ఓ ఓఓ..! చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం

బతుకు పదుగురితో అడుగు పడినదనీ
నడక నలుగురితో కలిసి నడవమనీ
ఉన్నతంగా చూడరామరి ఉన్నదే స్నేహం
నమ్మకంగా సాగరా కడదాకా ఓ నేస్తం

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం

కలతలే దాటీ… కలుపు దూరాన్నీ
కొరత ఏపాటీ కొలత వెయ్ దాన్నీ
కష్టమొచ్చి నేర్పిన తొలిముచ్చటీమాట, ఆ ఆ
ఇష్టపడటం నేర్చుకో విలువిచ్చి ప్రతిచోటా, ఆఆ

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఓ ఓఓ, ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం

Chukkala Melam song lyrics in telugu-Sridevi Soda Center movie

Leave a Comment

close