Movie:Maha Samudram
Singer:Deepthi Parthasarathy
Lyrics:Chaitanya Prasad
పాడినవారు-దీప్తి పార్థసారథి
వ్రాసినవారు- చైతన్య ప్రసాద్
సినిమా-మహా సముద్రం
Cheppake Cheppake song lyrics in Telugu-Maha samudram movie
చాలులే వేలాకోలం ఊరుకో
నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు
మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో
ఎగసే కలలే అలలై… యెదనే ముంచేసేలే
కదిలే కథలే కడలై… ఉప్పెనల్లే ఊపేసేలే
ఎందుకీ బంధాలన్నీ కలపకులే, నిలపకులే
గెంటేస్తాను గెంటేస్తాను… నిన్నిక ఇపుడే
మనసా కనబడితే ఎదురుగ నిలబడితే
చంపేస్తాను చంపేస్తాను తొందరపడితే
చల్లనైన చూపు నువ్వే… మంచి గంధపు మాట నువ్వే
ముళ్లకంచెలన్నీ తెంచి… పూల బాటవయ్యావే
మోయలేని హాయి నువ్వే… నన్నే మార్చిన మాయ నువ్వే
ముందు నువ్వు వెళ్తావుంటే… వెంట నీడనయ్యానే
వేసవి వేడిలో లేతగాలై వచ్చావే
మమతే కురిసి మనసే తడిసెలే
నువు నా జతగా ఉంటె… బతికా నే ధైర్యమై
తెలిసేనిపుడే ఇపుడే… జీవితాన మాధుర్యమే
వింతగా నన్నే నేను మరచితినే, మురిసితినే
నిన్నా లేని మొన్నా లేని… వెన్నెల విరిసే, మ్ మ్
మదికొక మది దొరికే… కలతల కథ ముగిసే
అంతే లేని సంతోషాల కాంతులు కురిసే
నువ్వు నేను వేరు అన్నా… నీవైపస్సలు చూడకన్నా
దొంగలాగ కళ్ళే నిన్నే… తొంగి తొంగి చూసాయే
పగ్గమేసి ఆపుతున్నా… ప్రేమే కాదిది స్వార్ధమన్నా
సిగ్గులేని కళ్ళే ముగ్గులోకి తోసాయే
నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే
కుదురే మరచి వరదై ఉరికెలే
తపమే తపమై జపమై… నిలిచా నీకోసమే
జడిలా ముసిరే కసిరే… జ్ఞాపకాల్ని తోసేసాలే
ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే, మది మురిసే
గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే… నిను ఇక వదలదులే
ఆనందాల మహాసంద్రామాయను మనసే