Song:Bangaara
Movie:Bangarraju
Singer:Madhu Priya, Anup Rubens
Lyrics:Bhaskarabhatla
పాట-బంగార
పాడినవారు-మధుప్రియ,అనూప్ రుబెన్స్
వ్రాసినవారు-భాస్కరభట్ల
సినిమా-బంగార్రాజు
Bangaara song lyrics in Telugu-Bangarraju movie
కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టిలు కట్టుకొని
చెవులకి కమ్మలు వెట్టుకొని
చేతికి గాజులు వేసుకొని
సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడు వస్తావయ్యా
నిను సూడకుంటే గుండె కొట్టుకోదయా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నువ్వంటే పడి పడి చస్తారా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నీ వెంటే లేచి వస్తారా
కాళ్ళకి పట్టిలు కట్టుకొని
చెవులకి కమ్మలు వెట్టుకొని
చేతికి గాజులు వేసుకొని
సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడు వస్తావయ్యా
నిను సూడకుంటే గుండె కొట్టుకోదయా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నువ్వంటే పడి పడి చస్తారా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నీ వెంటే లేచి వస్తారా
ఓ… చీరకు కుచ్చిళ్లలాగా
జడకి రిబ్బనులాగా
ఉంటావా ఉంటావా
తోడుగా ఉంటావా
ఓ మూతికి ముడుపులాగా
నడుముకి మడతలాగ
నీతోనే ఉంటాగా వదలనంటగా
అంటుకుపోతావా నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా చెంపకి సువ్వి సువ్వాలా
నీకింకా ఇంకా ఎం కావాలో
చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగుడు పెళ్ళాంలా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నువ్వంటే పడి పడి చస్తారా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నీ వెంటే లేచి వస్తారా
బంగార్రాజు… బంగార్రాజు…