Bad Luck Sakhi పాట లిరిక్స్ తెలుగులో-Good Luck Sakhi సినిమా

Pic Credit: Mango Music (YouTube)
Song:Bad Luck Sakhi

Movie:Good Luck Sakhi

Singer:Haripriya, Sameera Bharadwaj & MLR Karthikeyan

Lyrics:Shree Mani

పాట-బ్యాడ్ లక్ సఖి

పాడినవారు-హరిప్రియ, సమీరా భరద్వాజ్ & MLR కార్తికేయన్

వ్రాసినవారు-శ్రీ మణి

సినిమా- గుడ్ లక్ సఖి

Bad Luck Sakhi Song lyrics in Telugu-Good luck sakhi movie

మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే

రావే రావే సఖీ… మురిసే ముచ్చట్లకీ
సరదా సయ్యాటకీ… టకీ టకీ టకీ
ఇంకెన్నాళ్ళే సఖీ… నీ పప్పన్నానికి
త్వరగా ఓ మొగనికి… అయ్ పోవటే సఖీ

నీ ముక్కుకిలా తాడేసేవాడెవడే
నీ పక్కకి లాగింకెప్పుడు వస్తాడే
లక్కే లుక్కే వేసి లకుముఖి
ఒగ్గేసిందే నిన్నే చెకుముఖి
చిక్కేసావే ఇలా చివరికి
నువ్వే బ్యాడ్ లక్కీ

చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి

రోజులు రోజులు ఎదురే సూసి
అలసిన ఈ గాజులకి
ఏం సెబుతావే ఇంకేపుడంటే… నీ లెక్కన్ గడికి
వాటికి దేనికి నా గొడవ… అంటూ తిట్టేయ్ ఈ తడవా

తిలకం దిద్ది రంగులు అద్దె ముస్తాబమ్మాయిలకీ
పిలుపసలుందా నిను అందంగా సింగారించే పనికి
ఇంతందానికి సింగారం… అసలవసరమా మీ సాయం

జవాబులే అలా విసరక… నవాబుల ఇలా తిరగక
నసీబునే చలో మంచిగా… మార్చెయ్ దారిటికి
ఆపండెహె..!!

చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
లక్కులే గిక్కులే… నా పెళ్ళికి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
చాల్లే ఎళ్ళండి మీ ఇళ్ళకి

ఏది ఈ పిల్లా..!
అటు చూడండిరోయ్..!
ఈ అదృష్టాలను నమ్మను నేనసలే
మీ దృష్టిని మించిన దిష్ఠే లేదసలే, అబ్బో

భం భం భం భం… బబ భం భం భంభం
పొద్దున్న పొద్దున్న నువ్వు లేస్తే… జరమొస్తాదే సూర్యుడికి
పొద్దు తిరుగుడు పువ్వులు కూడా… తలవాల్చేస్తాయి ఇలకి
నువ్వెదురైనా నీకెదురైనా… మూడిందే ఇక ఆళ్ళకి
లాభం దండిగా ఉన్నోళ్ళయినా… తాకట్టే ఆఖరికి
పెరిగి పెరిగి నీ కీర్తి… పాకిందే పక్కూళ్ళకి
ఎన్నో ఎన్నో మారుతువున్న… మార్పేదే నీ రాతకీ

చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
ఇదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
ఎగబడతారేంటి ఎగతాళికి
చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి
తాళం వెయ్యండి… మీ నోళ్ళకీ

మీ కూతలతో… నాకస్సలు ఏం పనిలే
నా రాతనిలా, హహ్హా హ్హ… నేనే రాసేస్తాలే

Bad Luck Sakhi Song lyrics in Telugu

Leave a Comment

close