Baava Thaakithe Song లిరిక్స్ తెలుగులో-Sammathame

Song:Baava Thaakithe

Movie:Sammathame

Singer:Mallikarjun, Malavika

Lyrics:Sanapati Bhardwaj Patrudu

పాట-బావ తాకితే

పాడినవారు-మల్లికార్జున్, మాళవిక

వ్రాసినవారు-సనాపతి భరద్వాజ్ పాత్రుడు

సినిమా-సమ్మతమే

Baava Thaakithe Song Lyrics in Telugu-Sammathame Movie

చిటపట చినుకులు కురిసెనులే
ఎదలో అలజడి రేగే
పడి పడి తపనలు తడిసెనులే
తనువే తహ తహలాడే
ఏమి జరిగిందో నీ జారు జారు పైట
జారిపోతుంది
ఈడు దాడుల్లో
నా ఒంటి నుండే సిగ్గు పారిపోయిందే
కొండల్లో కోనల్లో
వాగుల్లో వంకల్లో
ఎన్నెన్నో వేషాలే వేద్దామా
ఎంచక్కా ఏపుల్లో తైతక్క ముద్దుల్లో
ఊరేగి ఆహా అందామా
బావ తాకితే మురిసే మురిసే
లేత పరువం మేరిసే
భామ కులుకులు తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే

మాట మాట చూపు చూపు
ఏకం చేసే వేలల్లోనా
కాలక్షేపం చెయ్యొదంది కొంటె కోరిక
రాలేనంటూ రారమ్మంటూ
సైగల్లోనే సంబందాన్నే
తెలియజేస్తూ ఉన్న నేను హై హై నాయక
ఎదో ఎదో చేసావే మ్యాజికె మ్యాజికె
ఆగేలాగా లేదే లోలో మ్యూజికె
వచ్చావంటే వేగంగా
నా దిక్కే నా దిక్కే
అయిబాబోయ్ ఎంత నా లక్కే
బావ తాకితే మురిసే మురిసే
లేత పరువం మేరిసే
భామ కులుకులు తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే

నిద్ర గిద్ర మాకేమాత్రం
వద్దోదంటూ చెప్పే కళ్ళు
నలుపు రంగు రాత్రిలోన
ఎరుపెక్కాలమ్మ
పెదవి పెదవి సున్నితంగా
రాజుకుందే మోజులోన
రాణించేటి రాజా నిన్ను ఆపతరమా
జివ్వు జివ్వు అంటుందే లోలోనా లోలోనా
బజ్జోబెట్టుకోవాలి నన్ను ఒల్లోనా
ఏనాడైనా నీ ఇష్టం కాదంటూ ఉన్నానా
ఊ అంటూ ఉహు అన్నానా
బావ తాకితే మురిసే మురిసే
లేత పరువం మేరిసే
భామ కులుకులు తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే

Baava Thaakithe Song Lyrics in Telugu

Leave a Comment

close