Awesome పాట లిరిక్స్ తెలుగులో-Aadavallu Meeku Joharlu

Song:Awesome

Movie:Aadavallu Meeku Joharlu

Singer:Sagar

Lyrics:Sreemani

పాట-Awesome

పాడినవారు-సాగర్

వ్రాసినవారు-శ్రీమణి

సినిమా-ఆడవాళ్ళూ మీకు జోహార్లు

Awesome Song Lyrics in Telugu-Aadavallu Meeku Joharlu Movie

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం… ఆసం
ఎంత ఎంత ఎంత ఎంత దూరం ఉన్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం… ఆసం
బాగున్నావా అని నువ్వడిగావా
నా బాధలన్నీ పారిపోవడం… ఆసం
బోంచేసావా అని ఓ మాటన్నావా
నా ఆకలే మాయమవ్వడం… ఆసం
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం… ఆసం
ఎంత ఎంత ఎంత ఎంత దూరం ఉన్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం… ఆసం

ఇంత కాలము ఇన్ని రాత్రులు
ఇలాగ నువ్వల్లే కబుర్లే లేక
కాలం వ్యర్థం ఆయెనే
ఇన్ని రోజులు రెండు కళ్ళల్లో
ఇలాగ కలల్నే కథల్ని చూసే వీలే లేకపోయెనే
నువ్వు నన్ను కలవమన్న చోటు ఎక్కడున్నా
ఓ గంట ముందు నేను రావడం ఆసం
ఇంటి వరకు సాగనంటి
వీడుకోలు అన్న
వెంటనే ఫోన్లు కలవడం ఆసం

నాకెంత నచ్చిన
నీకింత నచ్చెనే
దేన్నైనా చి అంటూ చ అంటూ
నీతోటి ఏవోటి తిట్లు కలపనా
ఏ పని వచ్చిన
మా అమ్మే చెప్పిన
నాతోటి ఎదో పని ఉంది అన్నావో
నీ వైపే నే పరుగు తీయనా హా
నీకు ఇష్టమైంది ఏది నువ్వు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం ఆసం
తాజ్ మహల్ అందమంటూ
నువ్వు పొగుడుతుంటే
షాజహాన్ నేనే అవ్వడం ఆసం
మేల్కొన్నావా అని నువ్వడిగావా
నా నిద్దరే సారి చెప్పడం ఆసం
తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా
ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం ఆసం

Awesome Song Lyrics in Telugu

Leave a Comment

close