Annayya పాట లిరిక్స్ తెలుగులో-Bro Movie

Song:Annayya

Movie:Bro

Singer:Sunitha

Lyrics:Bhaskarabhatla

పాట-అన్నయ్య

పాడినవారు-సునీత

వ్రాసినవారు-భాస్కరభట్ల

సినిమా-బ్రో

Annayya Song lyrics in Telugu-Bro Movie

ఈ రోజు కోసం నేనేంతగానో
చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా
మౌనాలు అన్నీ మాటాడుతుంటే
కనువిందుగా ఉంది తొలిసారిగా
అపురూపమేగా నాకీ క్షణాలు
దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా
అన్నయ నువ్వు పిలిస్తే
చెల్లిలా జన్మనేత్తాను
హాయి హాయిగా నువ్వు నవ్వితే
ఎంత ఎంత మురిసిపోతాను
అన్నయ నువ్వు తలిస్తే
కల్లముందు వాలిపోతాను
నువ్వు పంచిన ప్రేమకేపుడు
రుణపడి పోయే ఉంటాను
ఈ రోజు కోసం నేనేంతగానో
చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా

నాకోసం ఎన్నొ వదిలి
దూరంగా శిలలా బతికావే
నా కంట్లో రావాల్సిన కన్నీరంతా
నీ వొంట్లో చేమటల్లే మార్చువు కదారా
నాకోసం నువ్వెంత అల్లాడిపోయావు
నీకన్న ఇష్టంగా నను చూసుకున్నాను
నీ పిచ్చి ప్రేమంతా నాకె కాకుండ
వదినమ్మకి దాచరా
అన్నయ నువ్వు పిలిస్తే
చెల్లిలా జన్మనేత్తాను
హాయి హాయిగా నువ్వు నవ్వితే
ఎంత ఎంత మురిసిపోతాను
అన్నయ నువ్వు తలిస్తే
కల్లముందు వాలిపోతాను
నువ్వు పంచిన ప్రేమకేపుడు
రుణపడి పోయే ఉంటాను

నా కోసం వెతికి వెతికి
ఏ నిమిషం దిగులే పడిపోకు
నేనెక్కెడికెళతాను నిన్నే విడిచి
నీ వెచ్చని ఊపిరిలో ఉన్నాను కలిసి
నీ గుండె చప్పులు వింటూనే ఉంటాను
నువ్వు చెసే అల్లర్లు చూస్తూనే ఉంటాను
పొలిమారిపోతుంటే నే తలచుకున్నట్టే
అనుకోమంటాను
అన్నయ నువ్వు పిలిస్తే
చెల్లిలా జన్మనేత్తాను
హాయి హాయిగా నువ్వు నవ్వితే
ఎంత ఎంత మురిసిపోతాను
అన్నయ నువ్వు తలిస్తే
కల్లముందు వాలిపోతాను
నువ్వు పంచిన ప్రేమకేపుడు
రుణపడి పోయే ఉంటాను

Annayya Song lyrics in Telugu

Leave a Comment

close