అమ్మాడి పాట లిరిక్స్ తెలుగులో-Dhethadi Harika

Song:Ammadi

Singer:Vijay Bulganin & Nutana Mohan

Lyrics:Suresh Banisetti

పాట-అమ్మాడి

పాడినవారు-విజయ్ బుల్గనిన్ & నూతన మోహన్

వ్రాసినవారు- సురేష్ బనిశెట్టి

Ammadi Song Lyrics In Telugu-Love song of dhethadi Harika

ఏదో ఏదో చేశావమ్మాడి… ఏదో ఏదో అవుతోందమ్మాడి
నాలో మొత్తం నిన్నే నింపేశా… నీన్నదే లేనే లేను
ప్రాణాలన్నీ నీలో దాచేసా… తిరిగిమ్మని అడగలేను
నీవైపే చూస్తుంటే… నీ మాటే వింటుంటే
గుండె అడుగున తీపి అలజడి… రేగుతున్నది అందంగా
కంటి చివరన వింత వెలుగుని… ఒంపుతున్నది నువ్వేగా

ఓహో హో హో… ప్రేమిస్తే ఇంతేనా అన్నట్టుగా
వేరేదో లోకంలో ఉంటున్నాగా
నాలాగే నీక్కూడా ఉంటుంటుందా
నాతోటి ఓ సారి చెప్పొచ్చుగా
సగం అవునంటు సగం కాదంటూ
సందేహంలోన పడేస్తావుగా
సగం నిజమంటూ సగం కల అంటు
అయోమయమేదో మించేస్తావుగా
నేనిక అయ్యేదెల నీ సగం
ఏదో ఏదో చేశావమ్మాడి… ఏదో ఏదో అవుతోందమ్మాడి

ముసుగేసి కూర్చున్నా మనసాగదు
తలుపేసి కూర్చున్నా తలపగాదు
ఆపాలి అనుకున్న ఆశాగాదు
దాచాలి అనుకున్న ధ్యాసాగదు
ఇవన్నీ ఉంటే ప్రేమంటారంటే
ఏమో అవునేమో అనిపిస్తున్నది
ఈ చిత్రాలన్నీ నీ వల్లేనంటూ
నాకు ఇపుడెగా తెలుస్తున్నది
నువ్విలా మార్చావులే నన్నిలా

నీతో నీతో ఏదో చెప్పాలి… చెప్పేదెలా నువ్వే చెప్పాలి
నీ మైకంలో ప్రాణం జారిందో… ఎక్కడ్లేని ఎక్కిల్లోచ్చే
నీ గాలైనా నన్నే తాకిందో… పాదాలకే రెక్కలొచ్చే
ఊహల్లో ఊపిరిలో… కన్నుల్లో గుండెల్లో
ఇంత అలికిడి, ఇంత ఒరవడి… ఇంతవరకిది లేదాయే
ఇన్ని వింతలు, ఇన్ని గంతులు… ఇన్ని రోజులు ఏమాయే

Ammadi Song Lyrics In Telugu- dhethadi Harika

Leave a Comment

close