అమ్మ అమ్మ నీ వెన్నెల పాట లిరిక్స్-Paagal(2021)

Song:Amma Amma Nee Vennela

Movie:Paagal(2021)

Singer:Sid Sriram, Veda Vagdevi

Lyrics:Ramajogayya Sastry

పాట-అమ్మ అమ్మ నీ వెన్నెల

పాడినవారు-సిద్ శ్రీరామ్, వేద వాగ్దేవి

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-పాగల్(2021)

Amma Amma Nee Vennela song lyrics in Telugu-Paagal movie

కనుపాప నువ్వై వెలుగిస్తూ
నా కలకు రంగుల మెరుపిస్తూ
అడుగడుగు నీడై నడిపిస్తూ
ప్రతి మలుపులో నను గెలిపిస్తూ
అండగా ఉండవే… ఎప్పుడూ నువ్విలా
పండుగై నిండవే… లోపలా వెలుపలా
నువ్వు నాతోడై లేనిదే నేనెలా..!

అమ్మ అమ్మ నీ వెన్నెల… నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మ నీ వెన్నెల… నిత్యం నాపై ఉండాలిలా
ఆ ఆ ఆఆ నననాననా ఆ ఆ ఆఆ
అమ్మ అమ్మ నీ వెన్నెలా… నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మ నీ వెన్నెలా… నిత్యం నాపై ఉండాలిలా

తలనిమురు చేయి చాలు
తనువంతా హాయి స్వరాలూ
లాలనా స్వాంతన అన్ని నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవెనై నడపగా నిండు నూరేళ్లు
నా మొదటి నేస్తమా నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు, ఆ ఆఆ

అమ్మ అమ్మ నీ వెన్నెలా… నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మ నీ వెన్నెలా… నిత్యం నాపై ఉండాలిలా

లోకాన అమ్మలంత… అందించు ప్రేమనంతా
ఒక్క నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు
నన్నిలా పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరుజన్మలు నాకెదురుపడినగాని
నీ ఒడి పాపగా నన్నుండనీమ్మా, ఆ ఆఆ ఆఆ

అమ్మ అమ్మ నీ వెన్నెలా… నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మ నీ వెన్నెలా… నిత్యం నాపై ఉండాలిలా
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ, అమ్మా ఆఆ

Amma Amma Nee Vennela song lyrics

Leave a Comment

close