Alai Balai పాట లిరిక్స్ తెలుగులో-Ram Miriyala,Mama Sing

Song:Alai Balai

Movie:Ram Miryala

Singer:Ram Miriyala

Lyrics:Mama Sing, Ram Miriyala

పాట-రాం మిరియాల

పాడినవారు-రాం మిరియాల

వ్రాసినవారు-మామ సింగ్, రాం మిరియాల

సినిమా-రాం మిరియాల

Alai Balai Song Lyrics in Telugu-Ram Miryala,Mama Sing

నీ పేరేదైతే ఏంది అలాయి
పేరెనక తోకేదైతే ఏంది బలాయి
నీ భాషేదైతే ఏంది అలాయి
దాని యాసేదైతే ఏంది బలాయి

అరె, మతమేదైతే ఏంది
గతమేదైతే ఏందీ
అతుకుల బొంతల కింద
బతుకులు తెల్లారుతుంటే

ఏ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి
ఓహొ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి

నీ లీడరు ఎవరైతేందిరా అలాయి
వారి జాతేదైతే ఏందిరా బలాయి
నీ జెండా రంగేదైతేంది అలాయి
వాళ్ళు రెచ్చగొడితే ఉరుకుడేంది బలాయి

వారి మోచేతి సారా తాగి (సారా తాగి)
వారి మోచేతి సారా తాగి
కోడిపుంజులవోలే కొట్టుకుని సచ్చుడేంది, చల్

ఏ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి
ఓహొ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి

నీ హీరో ఎవరైతేందిరా అలాయి
వారు ఏ స్టారైతే ఏందిరా బలాయి
వారు తొడగొడితే ఈల వెయ్యి అలాయి
సారు మెడ ముడితే గోల సెయ్యి బలాయి, ఓహో

అంతేగాని తమ్ముడు
అలయ్ బలయ్ చేసుకుంట సార్లు దావత్లో ఉంటే
అలయ్ బలయ్ చేసుకుంట సార్లు దావత్లో ఉంటే
అభిమానం మత్తులోన ఏందిరా నీ లడాయి

ఏ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి
ఓహొ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి

హే, మతపెద్దల తీరు సూడు అలాయి
వారు పరమతమును పడనీయరు బలాయి
అరే, కులపోళ్ళ జోరు సూడు అలాయి
వాడు కులమే మన బలమంటడు బలాయి

తమ్ముడు, కులము మతమొదిలి రారా
ఎహే, కులము మతమొదిలి రారా
మనసారా అలుముకుందాం

ఏ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి
ఓహొ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి

ఏ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి
ఓహొ, అలాయి బలాయి అలాయి
ఏహే అలాయి బలాయి అలాయి

Ram Miryala Alai Balai Song Lyrics in Telugu

Leave a Comment

close