అడిగా అడిగా పాట లిరిక్స్ -అఖండ సినిమా

Song:Adiga Adigaa

Movie:Akhanda

Singer:SP Charan & M L Shruti

Lyrics:Kalyan Chakravarthy

పాట-అడిగా అడిగా

పాడినవారు-SP చరణ్ & M L శృతి

వ్రాసినవారు- కళ్యాణ్ చక్రవర్తి

సినిమా-అఖండ

Adiga Adiga song lyrics in Telugu-Akhanda Movie

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు… నీ ప్రేమ పారాణిగా
చిన్న నవ్వే రువ్వి మార్చేసావే… నా తీరు నీ పేరుగా
చూపు నాకే చుట్టి కట్టేసావే… నన్నేమో సన్నాయిగా

కదిలే కలలే కన్న… వాకిళ్ళలో కొత్తగా
కౌగిలే ఓ సగం… పొలమారిందిలే వింతగా
అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు… నీ ప్రేమ పారాణిగా

తక తై తక తకధిమి తకతక తై తక తకధిమి తక
గమమ మపప గస్స గమమ మపప గస్స
సాగరిసని నిస నిదపమ పా పనినిదపమ పా పస నిదపమ పా
పదని పదని పదనిసని గరిని సగరిగమపదనిని
నిసగరి సనిదప మగరిగమదపా నిగపపపా

సరిలేని సమరాలు… సరిపోని సమయాలు
తొలిసారి చూశాను నీతో
వీడిపోని విరహాలు… వీడలేని కలహాలు
తెలిపాయి నీ ప్రేమ నాతో

ఎల్లలేవి లేని ప్రేమే నీకే ఇచ్చానులే నేస్తమా
వెళ్ళలేనే నేనే నిన్నే దాటి
నూరేళ్ళ నా సొంతమా
కనని వినని సుప్రభాతాల సావాసమా
సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమా

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు… నీ ప్రేమ పారాణిగా

సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు
కలబోసి కదిలాయి నాతో
మనిషేమో సెలయేరు… మనసేమో బంగారు
సరిపోవు నీతో నూరేళ్లు

ఇన్ని నాళ్ళు లేనే లేదే
నాలో నాకింత సంతోషమే
మళ్ళీ జన్మే ఉంటే కావాలంట నీ చెంత ఏకాంతమే
కదిలే కలలే కన్న… వాకిళ్ళలో కొత్తగా
కౌగిలే ఓ సగం… పొలమారిందిలే వింతగా

అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు… నీ ప్రేమ పారాణిగా

Akhanda movie-Adiga Adiga song lyrics in Telugu

Leave a Comment

close