తెలంగాణ బోనాల పాట లిరిక్స్ తెలుగులో

శ్లోకం:-
ఇంద్రియనామ ధిష్టాత్రి భూతానాం చాకిలేషుయా
భూతేషు సతతం తస్యై వ్యాప్తి దేవ్యై నమో నమః
చితి రూపేణా యకృష్ట్రం మితద్వమ్య స్థిత జగత్
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

పల్లవి:-
ఏ పేరున పిలిచిన
పరుగున వచ్చి
కోర్కెలు తీర్చి
బతుకులు మార్చే
నీకోసం మేము
బోనాలు తెద్ధుమే
యటానేసెద్ధుమే
శాఖాన్ని పొద్దుమే
సల్లంగా సుడవే బెజవాడ దుర్గమ్మ, రేణుకా ఎల్లమ్మ, కట్ట మీద మైసమ్మ
కాపాడే మమ్మల్ని గోల్కొండ మాంకాలమ్మ, మా ఉరి మారెమ్మ, పొలిమేరలో పోలేరమ్మ

చరణం:- 1

గోల్కొండ కోట కాడ బోనాల జాతర
మాంకాలి అమ్మవారి ముస్తాబు చూడరా

ఆడేల్లి పోచమ్మకు బోనమెత్తు చాలురా
భోంగిర్ల రెనుకమ్మ భద్రంగా సుడదా

వరంగల్లా కాళికమ్మకు దండమెట్టు భక్తిగా
గద్వాల్లా జమ్ములమ్మ జర్రింత సుడదా

గుబ్బలా మంగమ్మకు సారేనియ్యు శ్రద్దగా
పాల్వంచలా పెద్దమ్మ ప్రాణమే నిలుపదా

సూర్యాపేట దండు మైసమ్మా నీ సాక్షిగా
ఎదురుకోళ్లు కొస్తామే బెల్లం శాఖ పొస్తమే

వేములవాడ బద్దీ పోచమ్మా నీ కోసమే
కోటి వేల దీపాలే పచ్చికుండల బోనాలే

చరణం:- 2

బల్కంపేట ఎల్లమ్మ బాయిలోన ఉండగా
ఉజ్జయిని అమ్మవారి వైభోగం చూడరా

మానుకోట ముత్యాలమ్మకు ముడుపులిస్తే మంచిగా
నిజాంబాదు మారెమ్మ ఇంటి ముందు నిల్వదా

గాంధారి కోటమ్మను కొలుసుకుంటే సక్కగా
ఫతేపూరు మైసమ్మ మస్తు వరలియ్యదా

భూపాల్పల్లి దుర్గమ్మను తలుసుకుంటే మనసుల
బయ్యారి పోచమ్మా మన బాధలు తీర్చదా

గండిపేట గండి మైసమ్మ నీకోసమే
రంగం షురూ చేసినమే ఘట్టం సిద్ధం చేసినమే

జగిత్యాల నల్ల పోచమ్మా నీ ముంగటే
పోతురాజై ఉన్నమే ప్రాణం నీదని అన్నమే

ఏ పేరున పిలిచిన
పరుగున వచ్చి
కోర్కెలు తీర్చి
బతుకులు మార్చే
నీకోసం మేము
బోనాలు తెద్ధుమే
యటానేసెద్ధుమే
శాఖాన్ని పొద్దుమే
సల్లంగా సుడవే బెజవాడ దుర్గమ్మ, రేణుకా ఎల్లమ్మ, కట్ట మీద మైసమ్మ
కాపాడే మమ్మల్ని గోల్కొండ మాంకాలమ్మ, మా ఉరి మారెమ్మ, పొలిమేరలో పోలేరమ్మ

Leave a Comment

close