వెళ్తున్నారా పాట లిరిక్స్-జగమే తందిరం తెలుగు

Song:Veltunnara

Movie:Jagame Thandhiram Telugu

Singer:Savitha Sai

Lyrics:-Bhaskarabhatla

పాట-వెళ్తున్నారా

పాడినవారు-సవితా సాయి

వ్రాసినవారు-భాస్కరభట్ల

సినిమా-జగమే తందిరం తెలుగు

Veltunnara Song Lyrics In Telugu -Jagame Thandhiram Telugu

వెళ్తున్నారా నన్నొదిలి
వెళ్తారా మన్నొదిలీ
గొంతు విప్పి చెప్పలేనే
వెళ్లొద్దు ఉండమని
వెళ్లొద్దు ఉండమని
కన్నబిడ్డ రెండు చెమ్మగిలితే చెమ్మగిలితే
కన్నతల్లి గుండెకోత ఎవరికి అర్థం కాదే
చేతులున్నా బాగున్నేమ్మో
సాయాన్ని చేసేదాన్ని
కాళ్ళు ఉన్న బాగున్నేమో
మీతోనే వచ్చేదాన్ని
మీతోనే వచ్చేదాన్ని
ఊరుదాటి ఏరుదాటి
ఎల్లలన్ని దాటి దాటి ఎక్కడికి వెళ్తారో
అక్కడేన్ని పడతారో
అక్కడన్ని పడతారో
ఓ… ఓ.. ఓ.. ఓ..

మళ్లి మళ్లి ఎప్పటికో
కలిసేది ఎన్నటికో
అందాక నా మనసే తట్టుకోడం కానిపనే
మళ్లి మళ్లి ఎప్పటికో
కలిసేది ఎన్నటికో
అందాక నా మనసే తట్టుకోడం కానిపనే
కాలానికి కన్ను కుట్టి
కల్లోలమే రేపిందిగా
ఇన్నినాళ్ళ పేగుబంధం దారుణంగా తెంచెనుగా
నట్టనాడి వీధుల్లోనా నెత్తిటేరు పారిందిగా
పూలతోటలాంటి చోట ప్రాణభయం పుట్టిందిగా

వెళ్తున్నారా నన్నొదిలి
వెళ్తారా మన్నొదిలీ
గొంతు విప్పి చెప్పలేనే
వెళ్లొద్దు ఉండమని
వెళ్లొద్దు ఉండమని
కన్నబిడ్డ రెండు చెమ్మగిలితే చెమ్మగిలితే
కన్నతల్లి గుండెకోత ఎవరికి అర్థం కాదే ఏ…

రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా
మంచిరోజు తప్పకుండా వస్తుందయా
రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా
మంచిరోజు తప్పకుండా వస్తుందయా
వాకిలిలో దీపమెట్టి కూర్చుంటా
మీరొచ్చే దారి వైపే చూస్తుంటా
మీ చోటు పదిలమే గుండెల్లో
క్షేమంగా వెళ్ళిరండి వెళ్ళిరండి మళ్ళి రండి

Leave a Comment

close