వస్తున్నా వచ్చేస్తున్నా పాట లిరిక్స్ తెలుగులో

Song:Vastunnaa Vachestunna

Movie:V

Singer:Shreya Ghoshal, Amit Trivedi

Lyrics:Sirivennela Seetarama Sastri

పాట-వస్తున్నా వచ్చేస్తున్నా

పాడినవారు-అమిత్ త్రివేది, శ్రేయ ఘోషల్

వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామశాస్త్రి

సినిమా-వి

Vastunnaa Vachestunna song lyrics in Telugu-V movie

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్న నా ధ్యాసంతా నీ మీదే తెలుసా

నిను చూడనిదే
ఆగనని ఊహల ఉబలాటం
ఉసి కొడుతుంటే

వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా

గడియో క్షణమో ఈ దూరం కలగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా

మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా

ఇప్పటి ఈ ఒప్పందాలే
ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే
ఏకాంతం ఇప్పించాలే

వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

Leave a Comment

close