మౌనంగా ఉన్నా పాట లిరిక్స్ తెలుగులో

Song: Mounanga Unna

Movie:Red(2021)

Singer:Dinker,Nutana Mohan

Lyrics:Sirivennela Seetharama Sastry

పాట-మౌనంగా ఉన్నా

పాడినవారు-డింకర్,నూతన మోహన్

వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామశాస్త్రి

సినిమా-రెడ్(2021)

మౌనంగా ఉన్నా పాట లిరిక్స్-Red(2021) movie

మౌనంగా ఉన్నా నీతో అంటున్నా
నా వెంట నిన్ను రారమ్మని
తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా… కదపొద్దంటున్నా లేలెమ్మనీ
వినలేదా కాస్తయినా… నీ ఎదసడిలోనే లేనా
వెతకాల ఏమైనా… నిను నాలోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు… మన ఇద్దరిది ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు… నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా… ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన

నాలో చిగురించిన ఆశకు… చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతియ్యని ఊహకు… ఒడిలో ఊయల వేసి
నీ పేరుతో కొత్తగా పుట్టనీ… నా జీవితం ఇప్పుడే మొదలనీ
ఒకటే బ్రతుకు… మన ఇద్దరిది ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు… నా ఆలాపన

ఎవరూ మన జాడని… చూడని చోటే కనిపెడదామా
ఎపుడూ మనమిద్దరి… ఒక్కరిలాగే కనబడుదామా
నా పెదవిలో నవ్వులా చేరిపో… నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు… మన ఇద్దరికి ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు… నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా… ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే… నా ఆలోచన

Leave a Comment

close