మనసెరిగిన తల్లికీ song lyrics in telugu-Navaratri Aarti songs

మనసెరిగిన తల్లికీ మంగళమని పాడరే
మధుర మంజులభాషిని మనోహరీ మహేశ్వరికి ||2|| |
బాలగా, లలితగా, మహా త్రిపురసుందరిగా,
నవరాత్రుల శుభదినాన మమ్మలరించే దేవికి
॥మనసెరిగిన||

అన్నారులకన్నమిడిన అన్నపూర్ణాదేవికి
కోరిన సంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మీ కి
కాళిదాసు మహాకవిని కరుణించిన కాళికి
పోతన భాగవతకవిత వాహిని శ్రీవాణికి
॥మనసెరిగిన||

మా ఇలవేల్పునకు మధురాపురవాసినికి
అందరినీ రక్షించిన మహిషాసురమర్దినికి
శరణన్నవారిని అభయమోసగు అంబకు
భక్తితో నమ్మిన భక్తుల బ్రోచె మాఅమ్మకు
॥మనసెరిగిన||

పరమేశ్వరి పాదాలకు పచ్చల హారతి
రాజరాజేశ్వరికీ రత్నాల హారతి
కనకదుర్గా మాతకు వజ్రాల హారతి
కాత్యాయనీ దేవికి కర్పూర హారతి
॥మనసెరిగిన||

Leave a Comment

close