గుచ్చే గులాబి పాట లిరిక్స్ తెలుగులో-మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్(2021)

పాట-గుచ్చే గులాబి

పాడినవారు-అర్మాన్ మాలిక్

వ్రాసినవారు-అనంత శ్రీరామ్ & శ్రీ మణి

సినిమా-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(2021)

Song:Guche Gulabi

Movie:Most Eligible Bachelor (2021)

Singer:Armaan Malik

Lyrics:Ananth Sriram & Shree Mani

గుచ్చే గులాబి పాట లిరిక్స్

అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే
వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే

ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని… వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే… అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి… నేను నడిచానులే

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

ఊపిరి పని ఊపిరి చేసే… ఊహలు పని ఊహలు చేసే
నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే
నేనేం మాటాడాలన్నా… నన్నడిగి కదిలే పెదవే
నా అనుమతి లేకుండానే… నీ పలుకే పలికిందే
ఏమిటే ఈ వైఖరి… ఊరికే ఉంచవుగా మరి
అయ్యా నేనే… ఓ మాదిరి !!

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

నీకోసం వెతుకుతూ ఉంటే… నే మాయం అవుతున్నానే
నను నాతో మళ్ళీ మళ్ళీ… కొత్తగ వెతికిస్తావే
బదులిమ్మని ప్రశ్నిస్తావే… నను పరుగులు పెట్టిస్తావే
నేనిచ్చిన బదులుని మళ్ళీ… ప్రశ్నగ మారుస్తావే
హే పిల్లో..! నీతో కష్టమే
బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే… నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే

Leave a Comment

close