కోలో కోలన్న కోలో పాట లిరిక్స్-టక్ జగదీష్

పాట-కోలో కోలన్న కోలో

పాడినవారు-అర్మాన్ మాలిక్ & హరిని ఇవాటూరి

వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సినిమా- టక్ జగదీష్

Song:Kolo Kolanna Kolo

Movie:Tuck Jagadish

Singer:Armaan Malik & Harini Ivaturi

Lyrics:-Sirivennela Seetharama Sastry

కోలో కోలన్న కోలో పాట లిరిక్స్ తెలుగులో

కోలో కోలన్న కోలో… కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు… కళ్ళల్లో కొలువుండాలి
ఆరారు ఋతువుల్లోని… అక్కర్లేనిది ఏముంది
చూడాలేగాని మన్నే రంగుల పూదోటవుతుంది
తోడై నీవెంట కడదాకా నేనుంటా
రాళ్ళైనా, ముళ్ళైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా..?
యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా
కోలో కోలన్న కోలో… కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు… కళ్ళల్లో కొలువుండాలి

చినచిన్న ఆనందాలు… చిన్నబోని అనుబంధాలు
అపుడపుడూ చెక్కిలిగింతలు పెడుతుండగా
కలతా కన్నీళ్లు లేని… చిననాటి కేరింతల్ని
చిటికేసి ఇటురమ్మంటూ పిలిపించగా

కదిలొస్తూ ఉంది చూడు… కన్నులవిందుగా
ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగా
హా..! నలుగురితో చెలిమి పంచుకో
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్నా జడిసేనా, తడిసేనా
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా..?
యమ ధీమాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

నీలోను నాలోనూ ఈ నేలేగా అమ్మై ఉంది
అంతా అయినోళ్లేగాని పరులెవ్వరూ
మనలోని చుట్టరికాన్ని మరిపించే ఈ దూరాన్ని
చెరిపే వీలుందంటే కాదనరెవ్వరూ
ఒక పువ్వు విచ్చిన గంధం… ఊరికే పోదుగా
పదిమందికి ఆనందం పంచకపోదుగా

ఆ ఆ..! తగిన వరసైన తారక
తెరలు విడి ధరికి చేరగా
ప్రతి నిత్యం పున్నమిగా అనుకోదా నెలవంకా
కలలన్నీ విరియగ విరిసిన వెన్నెలగా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
ఓ ఓ..! నిను వెంటాడే దిగులే వెళిపోతుందా..?
యమ ధర్జాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా
కోలో కోలన్న కోలో… కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు… కళ్ళల్లో కొలువుండాలి

Leave a Comment

close