Movie:Krack
Singer:Ramya Behra
Lyrics:Ramajogayya Sastry
పాడినవారు-రమ్య బెహ్రా
వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి
సినిమా-క్రాక్
ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది
ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ
నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది
ఏరి కోరి వెతికి
నీ అండ చూసింది…
నెత్తెక్కి కూర్చుంది
నన్నెల్లి పొమ్మంది సవతి
రవ్వంత నీ పక్క సోటివ్వనంటుంది
పోట్లాటకొస్తుంది దండెత్తి
ఆ సంగతేందో ఓ కాస్త
నువ్వే తేల్చుకోరా పెనిమిటీ
కోరమీసం పోలీసోడా
నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా
నన్ను నీతో ఉండనీరా
ఏ జనమలో నీకు
ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది
ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ
నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది
ఏరి కోరి వెతికి
పనిలో పడితే
నీకేది గురుతురాదు
నువ్వలా వెళితే
నాకేమో ఊసుపోదు
పలవరింత పులకరింత
చెరొక సగముగా
సమయమంతా నీవే ఆక్రమించినావురా
ఏ గుళ్లో ఏ గంట వినిపించినా గానీ
నిన్నేగా నే తలచుకుంటా
మెల్లోని సూత్రాన్ని ముప్పొద్దు తడిమేసి
నీ క్షేమమే కోరుకుంటా
నా లోకమంతా సంతోషమంతా
నీతో ఉన్నదంటా
కోరమీసం పోలీసోడా
నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా…
నన్ను నీతో ఉండనీరా
ఏ జనమలో నీకు
ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది
ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ
నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది
ఏరి కోరి వెతికి